Arjun Reddy Deleted Scene : అర్జున్ రెడ్డి డిలీట్ సీన్ చూసెయ్యండి..

Arjun Reddy Deleted Scene : అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయి నిన్నటితో సరిగ్గా ఐదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓ డిలిటెడ్ సీన్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ అర్జున్ రెడ్డి డిలిటెడ్ సీన్ టాలీవుడ్‌లో హాట్ టాపిగ్‌గా మారింది. ఈ సీన్ నిడివి 2.53 నిమిశాలు. రిలీజ్ చేసిన డిలిటెడ్ సీన్‌లో.. ప్రీతిని చాలా రోజుల తరువాత అర్జున్ రెడ్డి కలుస్తాడు. ఆమెను ముద్ద పెట్టుకుంటాడు. ప్రీతి తండ్రికి అర్జున్ రెడ్డికి గొడవ జరుగుతుంది. ఇది తలుచుకుంటూ అర్జున్ రెడ్డి తన స్నేహితుడు రాహుల్‌తో సంభాషన జరుపుతాడు. నేను చేసింది తప్పు కాదు అని అంటాడు. రాహుల్ అప్పుడు అర్జున్‌కు సర్ది చెబుతాడు. ప్రీతి తండ్రిగా ఆయన చేసింది కరెక్టే.. నీకు ప్రీతిపైన ఎంత ప్రేమ ఉందో ఫాదర్‌గా ఆయనకు అంతకంటే ఎక్కువ ప్రేమ ఉందంటాడు. ఆసక్తికరమైన ఈ డిలిటెడ్ సీన్ ఆలస్యం కాకుండా చూసెయండి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com