Rahul Ramakrishna: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న 'అర్జున్ రెడ్డి' నటుడు.. రొమాంటిక్ పోస్ట్ షేర్..

Rahul Ramakrishna: ఇటీవల సినీ పరిశ్రమలో నటీనటుల పెళ్లిల్లు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. అయితే తాజాగా మరో నటుడు కూడా పెళ్లి పీటలెక్కబోతున్నట్టు ఓ స్పెషల్ పోస్ట్‌తో అనౌన్స్ చేశాడు. 'అర్జున్ రెడ్డి' సినిమా ఎంతోమంది నటీనటులకు లైఫ్ ఇచ్చింది. వారిలో ఒకరే రాహుల్ రామకృష్ణ. ఈ నటుడు త్వరలోనే తన పెళ్లి అంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకు ఎంత ఫేమ్ వచ్చిందో.. రాహుల్ రామకృష్ణకు కూడా అదే రేంజ్‌లో గుర్తింపు వచ్చింది. అప్పటినుండి విజయ్ చేస్తు్న్న దాదాపు అన్ని సినిమాల్లో రాహుల్ రామకృష్ణ ఉండడం పక్కాగా మారిపోయింది. అంతే కాకుండా మరెన్నో సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీ అయిపోయాడు రాహుల్.
తనకు అనిపించింది అనిపించినట్టుగా చెప్పే వ్యక్తుల్లో రాహుల్ కూడా ఒకరు. తనకు ఏ విషయమైనా తప్పు అనిపిస్తే.. ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా వెంటనే దానిని విమర్శిస్తాడు. అలాంటి రాహుల్ త్వరలోనే పెళ్లికొడుకు కాబోతున్నాడు. ఓ లిప్ లాక్ ఫోటోతో తనకు కాబోయే భార్యను నెటిజన్లకు పరిచయం చేశాడు రాహుల్. 'అంతే కాకుండా త్వరలోనే పెళ్లి' అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.
Getting married, finally, soonly! pic.twitter.com/o4Fg5XlsT6
— Rahul Ramakrishna (@eyrahul) May 7, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com