Kalyan Ram : అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ పూర్తి

కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. సాయీ మంజ్రేకర్ హీరోయిన్. సొహైల్ ఖాన్ విలన్ గా నటించాడు. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతోంది. కొన్నాళ్ల క్రితం విడుదల చేసిన టీజర్ తో బిజినెస్ లో బూస్టప్ తెచ్చుకుంది ఈ మూవీ. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో బ్లాక్ బస్టర్ లుక్ వచ్చేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ చెప్పిన మాటలు సినిమా రేంజ్ ను మార్చాయి. చివరి 20 నిమిషాలు ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటారని చెబుతూ.. తనే కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేయడం అభిమానులకు చెప్పలేని కిక్ ఇచ్చింది.
సరిలేరు నీకెవ్వరు తర్వాత విజయశాంతి ఈ సారి చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోందని ముందే అర్థం అవుతోంది. పైగా పోలీస్ పాత్రలంటే తనకు టైలర్ మేడ్. అలాంటి రోల్ లో ఈ ఏజ్ లో కూడా అంతే పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. తల్లి, కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంతో తెరకెక్కిన అర్జున్ సన్నాఫ్ వైజయంతికి ఈ రెండు పాత్రలూ చాలా కీలకం కాబోతున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికెట్ వచ్చింది. సినిమా నిడివి 2 గంటల 24 నిమిషాలుగా ఉంది. మరి కళ్యాణ్ రామ్ ఈ సారి మరో బ్లాక్ బస్టర్ కొడతాడా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com