Kalyan Ram : డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి

నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బబ్లూ పృథ్వీరాజ్, శ్రీకాంత్, సోహైల్ ఖాన్ ఇతర పాత్రల్లో నటించారు. కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వినిపించింది. తల్లి కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఇప్పటి వరకూ ఇలాంటి సినిమా రాలేదు అనే కామెంట్స్ వచ్చాయి. కళ్యాణ్ రామ్, విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలకు థియేటర్స్ లో మంచి స్పందన వస్తోంది. ఇద్దరి మధ్య ప్రేమపూర్వక సీన్స్ తో పాటు కోపంతో ఉన్న సీన్స్ లోనూ విజయశాంతి నటనకు ఆమె ఫ్యాన్స్ మరోసారి ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా విజయశాంతికి ఇది పర్ఫెక్ట్ రీ ఎంట్రీలా ఉందంటున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆమెను కాస్త బేలగానే చూపించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. బట్ ఈ మూవీలో రెబల్ గా కనిపిస్తారు. రెండు ఫైట్స్ ఉన్నాయి. ఆమె పాత్ర చుట్టూనే సినిమా సాగుతుంది. అందుకే విజయశాంతికి ఇది కరెక్ట్ రీ ఎంట్రీలా ఉందంటున్నారు.
దర్శకుడు ప్రదీప్ చిలుకూరి కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా.. వాటికి సరైన జస్టిఫికేషన్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు. అందుకే మెచ్చుకుంటున్నారు. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ హైలెట్ గా ఉన్నాయీ చిత్రంలో. విలన్ మైనస్ అయినా.. బలమైన భావోద్వేగాలు పండటం ఆకట్టుకుంది. మొత్తంగా ఈ చిత్రం ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 5.15 కోట్ల గ్రాస్ వసూలు చేసి డీసెంట్ ఓపెనింగ్స్ అందుకుంది. రివ్యూస్ పాజిటివ్ గా వచ్చాయి. మౌత్ టాక్ కూడా బలంగా వెళుతోంది.. మండే నుంచి అన్ని స్కూల్స్ కు పూర్తిగా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి మరింత స్ట్రాంగ్ గా పికప్ అయ్యే అవకాశాలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com