Jayam Ravi : జయం రవిపై మాజీ భార్య ఆర్తి షాకింగ్ కామెంట్స్

తనకు చెప్పకుండా తన భర్త విడాకుల ప్రకటన చేశాడంటూ కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి భార్య ఆర్తి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన భార్య నుంచి విడిపోతున్నట్లు రెండు రోజుల క్రితం జయం రవి సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఆయన భార్య ఆర్తి స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఆర్తి తన ఇన్ స్టాలో.."నాకు తెలియకుండా, నా అంగీకారం లేకుండా మా పెళ్లి గురించి చేసిన పబ్లిక్ అనౌన్స్‌మెంట్ చూసి నేనే షాక్ అయ్యాను. 18 ఏళ్లు కలిసి ఉన్నాము. ఇలాంటి విషయాలను ఎంతో హుందాగా, గౌరవంగా, వ్యక్తిత్వంగా పరిష్కరించి ఉంటే బాగుండేది. ఇద్దరు పిల్లలను, నన్ను ఇలా గుడ్డిగా వదిలేసి, ఇలాంటి అనౌన్స్‌మెంట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. విడాకులు తీసుకోవాలని ఆయన తీసుకున్న నిర్ణయంలో నా ప్రమేయం అస్సలు లేదు. కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా, కలహాలు వచ్చినా కలిసి ఉండాలనే నేను కోరుకున్నాను. నా క్యారెక్టర్‌ని కించపరిచేలా జనాలు మాట్లాడుకుంటున్నారు. ఓ తల్లిగా నా మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ పిల్లలకే.. నా పైన వస్తున్న అడ్డమైన, ఆధారాలు లేని ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి క్లిష్ట సమయంలో బిడ్డలకు అవసరమైన మనో ధైర్యాన్ని ఇవ్వడమే నా ప్రధాన కర్తవ్యం. త్వరలో మా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.. ఏళ్లుగా మాకు అండగా నిలుస్తున్న అభిమానులకు, ప్రెస్, మీడియాకు థాంక్యూ.. ఇలాంటి క్లిష్ట సమయంలో మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం.. మా ప్రైవసీని కాస్త గౌరవించండి" అంటూ పోస్ట్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com