'అరుంధతి' తండ్రి గుర్తున్నారా? ఆయన కొడుకులు కూడా హీరోలే..!

అరుంధతి తండ్రి గుర్తున్నారా? ఆయన కొడుకులు కూడా హీరోలే..!
Arundhati: టాలీవుడ్‎లో అనుష్కకి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టిన మూవీ 'అరుంధతి'.

Arundhati: టాలీవుడ్‎లో అనుష్కకి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టిన మూవీ 'అరుంధతి'. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. జైజెమ్మగా అనుష్క నటన ప్రేక్షకులను మెప్పించింది. పశుపతిగా సోనూసూద్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఎంతో మంది హీరోయిన్స్ కి ప్రోత్సాహం ఇచ్చింది. అరుంధతి తర్వాత అనుష్క ఎన్నో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించారు. సినిమా గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలకు రాజీపడకుండా శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు.

అరుంధతి సినిమా విషయానికి వస్తే.. అరుంధతి పాత్ర పోషించిన అనుష్క తండ్రి పాత్ర పోషించిన నటులు మనకి గుర్తు ఉండే ఉంటారు. ఆయన పేరు శంకర్ అంతకుముందు కూడా ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో నటించారు. ముఖ్యంగా టెలివిజన్ రంగానికి అయితే శంకర్ చాలా సుపరిచితులు. ఆయన కొడుకులు కూడా ఇండస్ట్రీ లోనే ఉన్నారు.

ఆయన కొడుకులు కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. వారెవరో కాదు బాలాదిత్య, కృష్ణ కౌశిక్. వీళ్లిద్దరు కూడా చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటిస్తున్నారు. కృష్ణ కౌశిక్ ఎన్నో సీరియల్స్ లో కూడా నటించారు. పలువురు హీరోలకు డబ్బింగ్ కూడా చెప్పారు. కౌశిక్ ఆరుగురు పతివ్రతలు చిత్రంలో ఒక హీరోగా నటించారు. బాలాదిత్య చైల్డ్ ఆర్టిస్ట్ గా, అలాగే హీరోగా కూడా నటించారు. బాలాదిత్య చంటిగాడు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. 1940లో ఒక గ్రామం సినిమాకి అవార్డులు కూడా వచ్చాయి. అలాగే తెలుగు సిరియల్స్ లో నటిస్తు్న్నారు.Tags

Read MoreRead Less
Next Story