Arundhati Movie: 'అరుంధతి'కి 13 ఏళ్లు.. ఈ సినిమాను వదులుకున్న మలయాళ కుట్టి ఎవరంటే..?

Arundhati Movie: అరుంధతికి 13 ఏళ్లు.. ఈ సినిమాను వదులుకున్న మలయాళ కుట్టి ఎవరంటే..?
Arundhati Movie: అరుంధతి సినిమా అనుష్క కెరీర్‌కు ఎంత పెద్ద ప్లస్ పాయింట్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Arundhati Movie: టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చాలా తక్కువ. ఒకానొక సమయంలో విజయశాంతి, సౌందర్య లాంటి హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఓ దారిని చూపించారు. కానీ అలాంటి చిత్రాలకు కొన్నిరోజులు గ్యాప్ వచ్చంది. ఆ గ్యాప్‌ను ఫిల్ చేసేలా అనుష్క నటించిన 'అరుంధతి' సినిమా అనూహ్యంగా బ్లాక్ బస్టర్ హిట్‌గా మారింది. ఈ సినిమా వచ్చి ఇప్పటికి 13 ఏళ్లు పూర్తయ్యాయి.



అరుంధతి సినిమా అనుష్క కెరీర్‌కు ఎంత పెద్ద ప్లస్ పాయింట్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్‌నను ఏకంగా అరుంధతి ముందు, అరుంధతి తర్వాత అన్నట్టుగా మార్చేసింది సినిమా. అయితే ఈ సినిమాలో ముందుగా అనుష్కను అనుకోలేదట మూవీ టీమ్. మలయాళ భామ మమతా మోహన్‌దాస్ దగ్గరకు ముందుగా ఈ కథ వెళ్లిందట. అయితే అప్పుడప్పుడే కెరీర్‌ను ప్రారంభించిన మమతా.. తనకు ఏ కథలు ఎంచుకోవాలో తెలియక అరుంధతిని రిజెక్ట్ చేసినట్టుగా చాలాకాలం క్రితం బయటపెట్టింది. ఇది మాత్రమే కాదు.. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఉన్నాయి.


అనుష్కతో పాటు అరుంధతి వల్ల చాలా పేరు తెచ్చుకున్న మరో యాక్టర్ సోనూ సూద్. అయితే ఈ పాత్ర కోసం ముందుగా తమిళ నటుడు పసుపతిని తీసుకోవాలనుకుందట మూవీ టీమ్. కానీ అశోక్ చిత్రంలో సోనూ నటన చూసిన తర్వాత నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అతడే విలన్ రోల్‌కు కరెక్ట్ అని ఈ ఛాన్స్ ఇచ్చారు. అంతే కాకుండా అరుంధతిలో కీలక పాత్ర పోషించిన సయాజీ షిండే రోల్ కోసం ముందుగా నానా పాటేకర్, నజీరుద్దిన్ షా, అతుల్ కులకర్ణీ వంటి బాలీవుడ్ నటులను సంప్రదించగా.. వారెవ్వరి డేట్లు ఖాళీ లేకపోవడంతో ఈ అవకాశం ఆయనకు దక్కింది.


చంద్రముఖి, ఎక్సార్సిస్ట్ లాంటి సినిమాలు చూసిన తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి కూడా అలాంటి ఓ సినిమాను తెరకెక్కించాలని కోరిక మొదలయ్యిందట. అయితే ఈ సినిమాను తెరకెక్కించడంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్స్ అయిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. ఎలాగైన ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దగ్గరవ్వాలని భావించారట. ఇప్పటికీ ఎక్కువ నంది అవార్డులు అందుకున్న సినిమాగా అరుంధతి రికార్డ్ చెరిగిపోకుండా అలాగే ఉంది.


అరుంధతి సినిమాలో అనుష్క ఓ సీన్ కోసం ఏకంగా 22 కేజీల బరువున్న ఆభరణాలను ధరించింది. అప్పటివరకు ఎక్కవ బరువున్న కాస్ట్యూమ్‌గా పేరు తెచ్చుకున్న ఐరన్ మ్యాన్ సూట్‌కు పోటీగా అనుష్క ఈ స్టంట్ చేయడం అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. 130 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా 350 మిలియన్ల, ఓవర్సీస్‌లో 30 మిలియన్ల కలెక్షన్లను సాధించింది.

Tags

Read MoreRead Less
Next Story