Aryan Khan Bail: మూడోసారి కూడా ఆర్యన్ ఖాన్‌కు సేమ్ సీన్ రిపీట్..

Aryan Khan (tv5news.in)
Aryan Khan Bail: బాలీవుడ్ బాద్‌షా తనయుడు ఆర్యన్ ఖాన్ గురించే నేషనల్ మీడియా అంతా మాట్లాడుకుంటోంది. ఒక రేవ్ పార్టీలో ఉన్నప్పుడు ముంబాయి పోలీసులు ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. అదే పార్టీలో డ్రగ్స్ వాడకం జరుగుతండడంతో ఆర్యన్‌కు దీనితో సంబంధం ఉందని కేసు ఫైల్ చేశారు. కానీ ఆర్యన్ మాత్రం మొదటినుండి తాను ఏ తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నాడు. ఇది నమ్మి బాలీవుడ్ అంతా తనకు సపోర్ట్ చేస్తోంది. అక్కడి అధికారులు మాత్రం ఈ విషయాన్ని నమ్మట్లేదు.
ఆర్యన్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటినుండి షారూఖ్ తనకు బెయిల్ ఇప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ప్రతీసారి ఆ ప్రయత్నం విఫలమవుతూనే ఉంది. తాజాగా మూడోసారి ఆర్యన్‌కు బెయిల్ ఇప్పించే ప్రయత్నం చేశాడు షారూఖ్. ఇక మూడోసారి కూడా తనకు బెయిల్ రిజెక్ట్ అయ్యింది. దీంతో షారూఖ్, తన భార్య గౌరీ.. ఆర్యన్ విషయంలో ఆందోళన పడుతున్నారట.
ముందు దరఖాస్తు చేసిన బెయిల్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రత్యుత్తరాలను దాఖలు చేస్తుందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అద్వైత్ సేథ్నా జూనియర్ కోర్టుకు తెలియజేశారు. దీంతో బుధవారం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక ఎన్‌డిపిఎస్ కోర్టు తీర్పు వెలువరించింది. ఆర్యన్ బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. విచారణకు ముందు ఆర్యన్‌కు నేడు బెయిల్ దొరకడం ఖాయమని ముంబై సెషన్స్ కోర్టులో సీనియర్ న్యాయవాది మజీద్ మెమన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అది కాస్త రివర్స్ అయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com