Sharukh KHan: తండ్రిని రిజెక్ట్ చేసిన ఆర్యన్; రూ.120 కోట్లను తృణప్రాయంగా...

Sharukh KHan: తండ్రిని రిజెక్ట్ చేసిన ఆర్యన్; రూ.120 కోట్లను తృణప్రాయంగా...
'స్టార్‌డమ్' కోసం 100 కోట్ల + ఆఫర్‌ను తిరస్కరించిన బాద్ షా తనయుడు

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తన తొలి సిరీస్ 'స్టార్‌డమ్' కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాడు. తాజా అప్‌డేట్ ఏమిటంటే, ఈ సిరీల్ కోసం ఓ OTT ప్లాట్‌ఫారమ్ రూ. 120 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట. కానీ ఆర్యన్ ఖాన్ మాత్రం ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. షారుఖ్ ఖాన్ కొడుకు ఆఫర్‌ను తిరస్కరించడమే కాకుండా, సిరీస్‌లో తన తండ్రి అతిథి పాత్రను కూడా తిరస్కరించాడు. ఆర్యన్ చిత్రనిర్మాతగా అరంగేట్రం చేస్తున్నందున, కింగ్ ఖాన్ అతిథి పాత్రలో ఉండవచ్చని చాలా మంది ఆశించారు. అయితే ఈ వార్తలతో జవాన్ స్టార్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఆర్యన్ ఖాన్ తండ్రి ఎస్ఆర్కే (SRK) అతిథి పాత్రను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

సాధారణంగా అయితే హీరోల పిల్లలు హీరోలు లేదా హీరోయిన్ మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ ఆర్యన్ మాత్రం నటుడిగా మారాలని ఎప్పుడూ అనుకోలేదట. అందుకే అతను ఫిల్మ్ మేకర్ మార్గాన్ని ఎంచుకున్నాడు. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ ల పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇప్పుడు ఓ వెబ్ షోతో దర్శకుడిగా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన తన కొత్త ప్రాజెక్ట్ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాడని తెలుస్తోంది. అయితే ఆర్యన్ ఖాన్ తన 'బేబీ' వెబ్ సిరీస్‌ను ఇంకా విక్రయించడానికి సిద్ధంగా లేరని సమాచారం. ఎందుకంటే ఆయన 'స్టార్‌డమ్' ను పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటాడనే టాక్ వినిపిస్తోంది. సీజన్ 1 పూర్తికాకముందే 2, 3, 4ల కోసం చిత్రనిర్మాతలు ప్రాజెక్ట్‌ను తీయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా అన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఈ స్టార్ కిడ్ మరి ఏమి చూపించాలనుకుంటున్నాడో చూడటానికి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉండగా, తన తండ్రి, జవాన్ హీరో షారుఖ్ ఈ సిరీస్ లో అతిథి పాత్రలో నటించేందుకు తిరస్కరించినట్టు టాక్ నడుస్తోంది.

'పఠాన్' తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి షారుఖ్ ఖాన్.. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'జవాన్', రాజ్ కుమార్ హిరానీతో 'డంకీ'లో నటిస్తున్నారు. 'జవాన్' లో షారుఖ్ సరసన నయన తార నటిస్తుండగా.. ఈ మూవీ సెప్టెంబర్ 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.


Tags

Read MoreRead Less
Next Story