Aryan Khan: జైలు నుంచి ఆర్యన్ ఖాన్ విడుదల..

Aryan Khan: జైలు నుంచి ఆర్యన్ ఖాన్ విడుదల..
Aryan Khan: ఈ కేసులో ఆర్యన్‌కు గురువారమే బెయిల్‌ లభించినప్పటికీ విడుదల ప్రక్రియ ఆలస్యమైంది

Aryan Khan: క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసులో జైలుకెళ్లిన ప్రముఖ నటుడు షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ ఎట్టకేలకు విడుదలయ్యారు. ఈ కేసులో ఆర్యన్‌కు గురువారమే బెయిల్‌ లభించినప్పటికీ విడుదల ప్రక్రియ ఆలస్యమైంది.

దీంతో ఇవాళ జైలు నుంచి బయటికి వచ్చారు. కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆర్థర్‌ రోడ్‌ జైలు వద్దకు వచ్చారు తల్లిదండ్రులు షారుఖ్‌ఖాన్‌, గౌరీఖాన్‌. డ్రగ్స్‌ కేసులో జైలుకు వెళ్లిన ఆర్యన్‌ మూడు వారాల తర్వాత ఇంటికి చేరుకున్నారు.

డ్రగ్స్‌ కేసులో అక్టోబర్‌ 2న ఆర్యన్‌ను ఎన్‌సీబీ అరెస్ట్‌ చేసింది. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా అతనికి జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ అక్టోబర్‌ 7న ముంబై ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఆ మరుసటి రోజే ఆర్యన్‌ను ఆర్థర్‌ రోడ్‌ జైలుకు తరలించారు.

బెయిల్‌ కోసం ఆర్యన్‌ దరఖాస్తు చేసుకోగా.. స్పెషల్‌ కోర్టు తిరస్కరించింది. అనంతరం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మూడు రోజుల పాటు విచారణ చేపట్టిన కోర్టు.. బెయిల్‌ మంజూరు చేస్తూ గురువారం తీర్పునిచ్చింది

Tags

Read MoreRead Less
Next Story