Aryan Khan's journey: షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్.. బ్యాక్ గ్రౌండ్ ఏంటి..

Aryan Khans journey: షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్.. బ్యాక్ గ్రౌండ్ ఏంటి..
Aryan Khan’s journey: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ అంటే తెలియని వారెవరూ ఉండరు. అతడి కుమారుడు ఆర్యన్ ఖాన్ పుడుతూనే గోల్డెన్ స్పూన్.. కష్టపడకుండానే నేము, ఫేము వచ్చేశాయి.

Aryan Khan's journey: చైల్డ్ స్టార్ నుండి ఔత్సాహిక దర్శకుడిగా ఆర్యన్ ఖాన్ ప్రయాణం: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ అంటే తెలియని వారెవరూ ఉండరు. అతడి కుమారుడు ఆర్యన్ ఖాన్ పుడుతూనే గోల్డెన్ స్పూన్.. కష్టపడకుండానే నేము, ఫేము వచ్చేశాయి. ఏం చేసినా అడిగే వాళ్లు.. నాన్న సినిమాల్లో బిజీ అయితే.. కొడుకుకి గర్ల్ ఫ్రెండ్స్, పార్టీలు, పబ్బులు, మత్తు పదార్ధాలకి బానిస అవ్వడం. షారుఖ్ సూపర్‌స్టార్ అయినా పిల్లలిద్దరినీ మీడియాకి దూరంగా ఉంచాలనుకున్నాడు.

కానీ కూతురు సుహానా ఖాన్ కంటే, కొడుకు ఆర్యన్ తాను చేసే పనుల వల్ల ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాడు. కాంట్రావర్షియల్ ఇష్యూల్లో తల దూరుస్తాడు. తాజాగా డ్రగ్స్ కేసుల్లో ఇరుకున్నట్లు తెలుస్తోంది. ఆర్యన్ గురించి ఎక్కువగా వినిపిస్తుండడంతో అతడి కెరీర్ గురించి అతని వ్యక్తిత్వం గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.

ఆర్యన్ ఖాన్ నవంబర్ 13, 1997 న భారతదేశంలోని న్యూఢిల్లీలో జన్మించారు. అతను బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ మరియు ఇంటీరియర్ డిజైనర్ తల్లి గౌరీ ఖాన్ పెద్ద కుమారుడు. ఇతడికి సుహానా ఖాన్ అనే సోదరి, అబ్రామ్ అనే సోదరుడు ఉన్నారు.

తండ్రి ముస్లిం, తల్లి హిందూ.. రెండు మతాలను స్వీకరిస్తూ పెరిగారు పిల్లలు ముగ్గురూ.

చదువు

అనేక ఇతర స్టార్ పిల్లల వలె, ఆర్యన్ ఖాన్ కూడా విదేశాలలో చదువుకున్నాడు. లండన్‌లోని సెవినోక్స్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి అక్కడి నుంచి దక్షిణ కాలిఫోర్నియా యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

ఇతరత్రా వ్యాపకాలు

ఆర్యన్ ఖాన్ చిన్న వయస్సు నుండే ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తూ క్రీడల్లో రాణించేవాడు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందాడు. తైక్వాండోలో బ్లాక్ బెల్ట్‌ సంపాదించాడు. ఆర్యన్ 2010 లో మహారాష్ట్ర తైక్వాండో పోటీలో బంగారు పతకాన్ని సాధించాడు.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆర్యన్

కరణ్ జోహార్ 'కభీ ఖుషి కభీ ఘమ్ ..' లో బాల నటుడిగా ఆర్యన్ నటించాడు. ఈ సినిమా ప్రారంభ పాటలో ఆర్యన్ జూనియర్ షారూఖ్ ఖాన్ పాత్రను పోషించాడు. 'కభీ అల్విడా నా కెహనా' చిత్రంలో ఒక సన్నివేశంలో కనిపిస్తాడు.

వాయిస్ ఓవర్‌లు

ఆర్యన్ ఖాన్‌ది అద్భుతమైన వాయిస్. 2004 లో 'హమ్ లాజవాబ్ హే' సినిమాలో తేజ్ పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. ఈ సినిమాతో ఉత్తమ డబ్బింగ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవార్డును కూడా అందుకున్నాడు.

'ది లయన్ కింగ్' సినిమా హిందీ వెర్షన్‌లోని 'సింబా' పాత్రకు ఆర్యన్ తన స్వరాన్ని అందించాడు.

కెరీర్ లక్ష్యాలు

ఆర్యన్ ఖాన్ తండ్రిలా సినిమాల్లో యాక్ట్ చేస్తాడని అనుకుంటారు చాలా మంది. కానీ అతడి తెరపై కనిపించడం పట్ల ఆసక్తి లేదు. నటనపై కాకుండా సినిమా నిర్మాణం మరియు దర్శకత్వంపై దృష్టి పెట్టాలనుకున్నాడు. అందుకే దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఫిల్మ్ మేకింగ్, ష్క్రిప్ట్ రైటింగ్‌పై కోర్సు చదువుతున్నాడు.

BFF లు

సోషల్ మీడియాలో ఆర్యన్ ఖాన్ చిత్రాలు ఎక్కువగా విదేశాలలో ఉన్న తన స్నేహితులతో కలిసి దిగినవే ఉంటాయి.

భారతదేశంలో ఉన్నప్పుడు మాత్రం సోదరి సుహానా ఖాన్ స్నేహితులు షానయా కపూర్, అనన్య పాండే, అహాన్ పాండే, నవ్య నవేలి నందా వంటి వారితో కలిసి పార్టీలు చేసుకుంటూ గడుపుతాడు. తాజాగా క్రూయజ్ నౌకలో రేవ్ పార్టీ చేసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డాడు ఆర్యన్. వీరి వద్ద నుంచి కొకైన్‌, గంజాయి, MDMA వంటి మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story