Surya: అరుదైన ఆహ్వానం.. ఆస్కార్ కమిటీలో సూర్య..

Surya: అరుదైన ఆహ్వానం.. ఆస్కార్ కమిటీలో సూర్య..
కోలీవుడ్ నటుడు సూర్యకు ఆస్కార్ కమిటీ నుంచి అరుదైన ఆహ్వానం అందింది. కమిటీకి ఆహ్వానించబడిన మొదటి తమిళ నటుడిగా చరిత్ర సృష్టించి భారతదేశానికి గర్వకారణంగా నిలిచాడు.

Surya: కోలీవుడ్ నటుడు సూర్యకు ఆస్కార్ కమిటీ నుంచి అరుదైన ఆహ్వానం అందింది. కమిటీకి ఆహ్వానించబడిన మొదటి తమిళ నటుడిగా చరిత్ర సృష్టించి భారతదేశానికి గర్వకారణంగా నిలిచాడు.సూర్య అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో బాలీవుడ్ నటి కాజోల్, ఆస్కార్ నామినేటెడ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్లు సుష్మిత్ ఘోష్ మరియు రింటు థామస్, భారతీయ సంతతికి చెందిన అవార్డు-విజేత చిత్రనిర్మాత నలిన్ కుమార్ పాండ్యా అకా పాన్ నలిన్ మరియు ఆదిత్య సూద్ ( డెడ్‌పూల్, మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్) ఉన్నారు.

అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన జై భీమ్, సూరరై పొట్రు చిత్రాలలో సూర్య నటనకుగాను మంచి ప్రశంసలు లభించాయి. ఈ చిత్రాలతో సూర్య ప్రపంచ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. సూర్య నటించిన జై భీమ్ చిత్రం ఆస్కార్ లైబ్రరీ 'సీన్ ఎట్ ది అకాడమీ' కేటగిరీకి కూడా జోడించబడింది.

ఆస్కార్ కమిటీలో చేరిన తొలి తమిళ నటుడు సూర్య. సంస్థలో చేరేందుకు ఆహ్వానించిన 397 మంది ప్రముఖ కళాకారులు మరియు కార్యనిర్వాహకుల జాబితాను అకాడమీ విడుదల చేసింది. ఆస్కార్ కమిటీలో భాగమైన మొదటి తమిళ నటుడు సూర్య కావడం విశేషం. కొత్త సభ్యులను వారి వృత్తిపరమైన అర్హతల ఆధారంగా ఎంపిక చేసినట్లు అకాడమీ తెలిపింది. ఈ విషయం తెలియగానే సూర్య అభిమానులు ఉప్పొంగిపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story