Ashika Ranganath : 'విశ్వంభర' సెట్స్ లోకి అడుగు పెట్టిన అషికా రంగనాథ్

Ashika Ranganath : విశ్వంభర సెట్స్ లోకి అడుగు పెట్టిన అషికా రంగనాథ్

మెగాస్టార్ హీరోగా బింబిసార్ ఫేమ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక సీన్స్ షూట్ చేసినట్లు సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటీవలే తన పోర్షన్ను కూడా దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీంతో డైరెక్టర్ మిగతా నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా నటి అషికా రంగనాథ్ ఇప్పుడు 'విశ్వంభర' సెట్స్లో సందడి చేస్తోంది. తాజాగా నైట్ షూట్స్ అంటూ ఓ ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. సినిమా విషయానికి వస్తే త్రిష, అశికా రంగనాథ్, ఇషా, సురభి లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, కాన్సెప్ట్ వీడియో కూడా ప్రేక్షకులను సినిమాపై మరిన్నీ అంచనాలు పెంచే సేంది. యు.వి.క్రియేషన్స్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కుతోంది.

Tags

Next Story