Ashok Galla : అశోక్ కల సితార నెరవేరుస్తుందా..?

Ashok Galla :  అశోక్ కల సితార నెరవేరుస్తుందా..?
X

బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఈజీ అవుతుంది కానీ టాలెంట్ అండ్ సక్సెస్ ఉంటేనే సర్వైవ్ అవుతారు. ఇది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ప్రూవ్ అవుతున్న విషయం. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అనే ట్యాగ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు గల్లా అశోక్. ఫస్ట్ మూవీ హీరో డిజాస్టర్.అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అయినా మినిమం ఇంపాక్ట్ కనిపించలేదు ఈ చిత్రంతో. ఆ తర్వాత కాస్త సౌండ్ చేసిన మూవీ దేవకి నందన వసుదేవ. టైటిల్ ఆకట్టుకుంది. కానీ సినిమా డిజాస్టర్. దీంతో కుర్రాడి కెరీర్ డైలమాలో పడింది. ఈ టైమ్ లో ఎంట్రీ ఇచ్చింది సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్.

సితార బ్యానర్ లో సినిమా అంటే మాగ్జిమం గ్యారెంటీ అనే ట్యాగ్ ఎప్పుడో పడిపోయింది. కథా బలం ఉన్న చిత్రాలకు కేరాఫ్ ఈ బ్యానర్. అదనంగా మంచి వినోదం గ్యారెంటీ. అందుకే అశోక్ కెరీర్ ను నిలబెట్టే బాధ్యత ఈ బ్యానర్ తీసుకుంది. తాజాగా అశోక్ బర్త్ డే సందర్భంగా సితారలో నిర్మతమవుతున్న మూవీ టైటిల్ తో పాటు టీజర్ ను కూడా విడుదల చేశారు. టైటిల్ ఇంగ్లీష్ లో అయితే 'విస'. దీన్ని తెలుగులో 'వింటారా సరదాగా"అని పెట్టుకున్నారు. వింటారా సరదాగాకు షార్ట్ ఫామ్ వి.స అన్నమాట.

మరి సరదాగా ఏం వినాలి అంటే ఇదుగో అంటూ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే.. తెలుగు స్టేట్స్ నుంచి యూనైటెడ్ స్టేట్స్ కు వెళ్లిన కొందరు కుర్రాళ్ల కథలా కనిపిస్తోంది.అక్కడ పాడ్ కాస్ట్ చేసే కుర్రాడి కథే ఇది. మన దేశం, ఆ దేశం మధ్య వ్యత్యాసం గురించి చెబుతూ.. అక్కడైనా ఇక్కడైనా తప్పించుకోలేని ఒకటి ఉంది.. అదే ప్రేమ అంటాడు. ఆ తన ప్రేమకథనే సరదాగా వింటారా అంటున్నాడు అశోక్.

అశోక్ సరసన శ్రీ గౌరిప్రియ హీరోయిన్ గా నటించింది. ఇప్పటి వరకూ పద్దతిగా కనిపించిన ఈ అమ్మాయి ఈ మూవీతో లిప్ లాక్ లు, ఇంటిమేట్ సీన్స్ కు రెడీ అని చెప్పేసిందని టీజర్ తోనే అర్థం అయింది. అలాగని వల్గారిటీ లేదు. ఏదేమైనా ఈ టీజర్ ఫ్రెష్ గా కనిపిస్తున్నప్పటికీ చాలా యేళ్ల క్రితం వచ్చిన 'వెన్నెల' మూవీ ఛాయలు కనిపిస్తున్నాయి. దాన్ని దాటి ఆడియన్స్ ముందుకు వస్తే ఆడియన్స్ ఖచ్చితంగా ఈ చిత్రాన్ని చూస్తారు.. సరదాగా.

Tags

Next Story