BIG BOSS: నేడే మలయాళం బిగ్‌బాస్ ఫైనల్

మలయాళ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న బిగ్‌బాస్ రియాలిటీ షో విజయవంతంగా 5వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. శనివారం చివరి ఎపిసోడ్ సందడిగా సాగింది. సుమారు 100 రోజుల ప్రయాణం తరువాత మలయాళం బిగ్‌బాస్ ఇవ్వాల్టి ఫినాలే ఘట్టంతో ముగియనుంది. నేడు ప్రసారమయ్యే బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి టైటిల్‌ను ఎవరు గెలుచుకుంటారోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బిగ్ బాస్ హౌస్‌లో వంద రోజులు గడిపిన పోటీదారుల నుంచి తుది విజేతను ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రకటించనున్నారు. ప్రేక్షకులు వేసిన ఓట్లను బట్టి విజేతను నిర్ణయిస్తారు.
గ్రాండ్ ఫినాలేను వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నోబి, కుట్టి అఖిల్, సూరజ్, మంజు పాత్రోస్, రెమ్యా పనికర్, రీతు ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. నేపథ్య గాయని గౌరీ లక్ష్మి, సంగీత విద్వాంసుడు స్టీఫెన్ దేవస్సీల సంగీత ప్రదర్శన కూడా ఉండనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com