Allu Arjun: అల్లు అర్జున్‌కి ఆస్ట్రాలజర్ల సూచన.. పూజలు, హోమాలు..

Allu Arjun: పుష్స ది రైజ్‌తో హిట్ కొట్టిన అల్లు అర్జున్ తగ్గేదేలే అన్నట్లు పుష్సది రూల్‌కి రెడీ అయిపోతున్నాడు.. సినిమాపై అతడికి ఉన్న ప్యాషన్, డెడికేషన్ వెరసి ఆ చిత్రాన్ని అగ్రస్థానంలో నిలబెడుతుంది.. ప్రేక్షకులు ఆ చిత్రానికి పట్టంకడతారు.. ప్రతి సినిమాలో అతడికో మేనరిజమ్.. అది ఆడియన్స్‌కి రీచ్ అవుతుంది..
కొంతకాలం ఆ మ్యానియా అలా కొనసాగుతుంది.. ఇప్పుడు ఎక్కడ చూసినా తగ్గేదేలా వినిపిస్తోంది.. రాజకీయ నాయకులు సైతం వారి ప్రసంగాల్లో వాడేస్తున్నారు. అన్నీ ఉన్నా అదృష్టం కూడా కొంత ఉంటేనే ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా రాణించగలుగుతారు.. అంతా బాగానే ఉంది అని అనుకుంటున్న తరుణంలో సడెన్‌గా బ్రేక్ పడే అవకాశం ఉంటుంది.. మరి అలాంటివి జరక్కుండా ఉండాలంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం అస్ట్రాలజర్ల సూచన మేరకు నడుచుకోవాలనుకుంటున్నాడు అల్లు అర్జున్.
పుష్ప హిట్‌ని ఆస్వాదిస్తున్న బన్నీ తన జీవితంలో అత్యున్నత దశకు చేరుకున్నాడని జ్యోతిష్యులు అంచనా వేసినట్లు సమాచారం. పరిశ్రమలో నటుడిగా, క్రియేటివ్ ఆర్టిస్ట్‌గా అగ్రస్థానానికి చేరుకోవడానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలి. అందుకోసం అల్లు అర్జున్ ప్రత్యేక పూజలు, హోమాలు చేయాలని జ్యోతీష్యులు సూచించారు. త్వరలో అల్లు అర్జున్ తన ఫామ్‌హౌస్‌లో హోమాలు, పూజలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com