Athadu Movie Re Release : ‘అతడు’మళ్లీ దెబ్బకొట్టేలా ఉన్నాడుగా

Athadu Movie Re Release :  ‘అతడు’మళ్లీ దెబ్బకొట్టేలా ఉన్నాడుగా
X

రీ రిలీజ్ లు రిలీజ్ లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జనం అసలు కంటే కొసరుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా ఇవన్నీ స్టార్ హీరోల సినిమాలు కావడంతో ఫస్ట్ టైమ్ రిలీజ్ అవుతున్నంత హడావిడీ చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా. దీంతో కొత్తగా విడుదలయ్యే సినిమాలు వీటి మరుగున పడిపోతున్నాయి. ఇంతకు ముందు ఖలేజా రీ రిలీజ్ టైమ్ లో ఆ ప్రభావం భైరవంపై పడింది. కంటెంట్ పరంగా బానే ఉన్నా భైరవం.. ఖలేజా ధాటికి కనుమరుగైంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు మరోసారి ఎదురు కాబోతోందా అంటే అవుననే అంటున్నారు. కాకపోతే ఒక్క రోజు రిలీఫ్ ఉంది.

ఈ నెల 8న చాలా చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. వీటి గురించి జనానికి తెలిసింది తక్కువ. కానీ బుక్ మై షోలో మహేష్ బాబు అతడు మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం అదిరిపోతున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ నటించిన ఫస్ట్ మూవీ కావడం, మణిశర్మ మ్యూజిక్, త్రిష, కామెడీ హైలెట్ గా నిలిచిన సినిమా ఇది. రిలీజ్ టైమ్ లో మరీ పెద్ద విజయం సాధించలేదు. కానీ తర్వాత టివిల్లో సూపర్ హిట్ అయింది. అంతకు ముందు ఖలేజా పరిస్థితి కూడా ఇదే కావడం విశేషం. అతడు చిత్రాన్ని ఈ నెల 9న మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. 8న ఏకంగా 6 సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో కాస్త ఎక్కువ ఆకట్టుకుంటోందీ అంటే కన్నడ నుంచి డబ్ అవుతున్న ‘సు ఫ్రమ్ సో’. 3 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ కన్నడలో ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే మనీ హారర్ అండ్ మెగా కామెడీ సినిమాగా తేల్చారు ఆడియన్స్ అక్కడ. ఆ మూవీనే తెలుగులో డబ్ చేస్తున్నారు. మళయాలం నుంచి అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపీ నటించిన జానకి.. వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చిత్రం వస్తోంది. ఇది గతంలోనే మళయాలంలో విడుదలైంది. మరి తెలుగులో ఎలాంటి స్పందన వస్తుందో.

తెలుగు నుంచి వైవా హర్ష, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో నటించిన బకాసుర రెస్టారెంట్ విడుదలవుతోంది. ఇది కూడా హారర్ బ్యాక్ డ్రాప్ లోనే సాగే సినిమా అని ట్రైలర్ తో అర్థమైంది. బట్ ప్రమోషన్స్ లేవు. అంతా కొత్తవాళ్లే నటించిన రాజు గాని సవాల్, భళారే సిత్రం, బ్లాక్ నైట్ అనే చిత్రాలు ఈ 8న రిలీజ్ అవుతున్నాయి. వీటి గురించి ఆడియన్స్ పట్టించుకుంటారా అనేది పక్కన పెడితే నెక్ట్స్ డే అంతా ‘అతడు’ మయం అయిపోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.

Tags

Next Story