Athiya Shetty: తమ్ముడి సినిమాకు బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లిన హీరోయిన్..

Athiya Shetty (tv5news.in)
Athiya Shetty: బాలీవుడ్‌లో ప్రస్తుతం రీమేక్ సినిమాలు పోటీపడుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా తెలుగు నుండే ఎక్కువ సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి. తెలుగులో ఒక సెన్సేషన్ సృష్టించిన 'ఆర్ఎక్స్ 100' సినిమా ఇటీవల హిందీలో రీమేక్ అయ్యింది. ఇందులో హీరోగా సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి నటించాడు. అహాన్‌కు ఇదే తొలి సినిమా. ఈ రీమేక్ 'తడప్' పేరుతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తడప్‌లో అహాన్‌కు జోడీగా తారా సుతారియా నటించింది. సునీల్ శెట్టి అంటే బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి తనదైన ముద్ర వేసుకున్న నటుడు. అయితే తన కుమారుడు సినిమాల్లోకి అడుగుపెడుతున్నాడు అనగానే బాలీవుడ్‌లోని బడా దర్శకనిర్మాతలు, నటీనటులు తనకు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. తాజాగా సెలబ్రిటీలకు ప్రత్యేకంగా తడప్ ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు మూవీటీమ్.
ఈ ప్రీమియర్ షోకు బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాదు.. సునీల్ శెట్టి కుటుంబం కూడా హాజరయ్యింది. తన కూతురు అతియా శెట్టి.. ఈ ప్రీమియర్ షో వల్ల బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఈ షోకు అతియా.. తన బాయ్‌ఫ్రెండ్ కేఎల్ రాహుల్‌తో కలిసి వచ్చింది. క్రికెటర్ కేఎల్ రాహుల్, సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి రిలేషన్‌లో ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పటివరకు వీరిద్దరు దీనిపై స్పందించలేదు.
ఇదివరకు కేఎల్ రాహుల్ ఆడిన ప్రతీ మ్యాచ్‌కు అతియా స్టేడియంకు వచ్చేది. కానీ గత కొంతకాలంగా వీరిద్దరు కలిసి కనిపించడం తగ్గిపోయింది. దీంతో రిలేషన్ బ్రేక్ అయ్యిందా అన్న పుకార్లు వినిపించాయి. తడప్ ప్రీమియర్ షో.. ఈ పుకార్లను కొట్టిపారేసింది. అంతే కాకుండా అతియా.. తడప్ సినిమాను చూసి తన తమ్ముడి కోసం ఎమోషనల్‌గా పోస్ట్ కూడా పెట్టింది. తన తమ్ముడిని స్క్రీన్‌పై హీరోగా చూడడం గర్వంగా ఉందని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com