Athiya Shetty: క్రికెటర్‌తో పెళ్లి.. స్పందించిన అతియా శెట్టి..

Athiya Shetty: మామూలుగా ప్రేమకథలు అనేవి సినీ పరిశ్రమలో ఉన్నవారి మధ్య మాత్రమే ఉండవు. క్రికెటర్, హీరోయిన్ మధ్య ప్రేమకథలు కూడా ఎన్నో ఉన్నాయి. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు కూడా ఉన్నారు. తాజాగా అలాంటి మరో జంట పెళ్లి పీటలెక్కనుందని, కొత్త ఫ్లాట్‌కు కూడా షిఫ్ట్ అవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల దీనిపై స్పందించింది ఆ నటి.
బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి కూడా హీరోయిన్‌గా అడుగుపెట్టి చాలాకాలమే అవుతోంది. కానీ తన కెరీర్‌కు బ్రేక్ ఇచ్చే సినిమా ఇప్పటివరకు అతియా శెట్టికి దొరకలేదు. అయితే ఇంతలోనే తాను క్రికెటర్ కెఎల్ రాహుల్‌తో ప్రేమలో పడింది అంటూ రూమర్స్ మొదలయ్యాయి. అంతే కాకుండా అతియా శెట్టి తన ఫ్యామిలీ మీటింగ్స్‌కు కూడా రాహుల్ వెళ్లడంతో ఈ రూమర్స్ నిజమే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు.
ఇక తాజాగా కెఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లి గురించి బాలీవుడ్ అంతా మాట్లాడుకుంటోంది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది అని వదంతులు ఎక్కువయిపోయాయి. దీంతో అతియా కూడా వీటిపై స్పందించింది. తాను కొత్త ఫ్లాట్‌కు షిఫ్ట్ అయ్యే మాట నిజమేనని, కానీ అది తన ఫ్యామిలీతోనే అని స్పష్టత ఇచ్చింది అతియా. ఇక పెళ్లి రూమర్స్‌పై కూడా తాను స్పందించింది.
తాను ఈ ప్రశ్నలకు బదులివ్వనని చెప్పేసింది అతియా శెట్టి. ఇలాంటి వాటి వల్ల తాను అలసిపోయానని చెప్పింది. ఇలాంటి వార్తలు విని నవ్వుకోవడం తప్ప సమాధానం చెప్పదలచుకోలేదని క్లారిటీ ఇచ్చేసింది. ప్రజలకు వారికి నచ్చినట్టుగా ఆలోచించుకోనీ అని ఈ టాపిక్‌ను కట్ చేసేసింది అతియా. దీనిపై అతియా కుటుంబ సభ్యులు కూడా ఇలాగే స్పందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com