Allu Arjun : అల్లు అర్జున్, త్రివిక్రమ్ మధ్యలో అట్లీ..?

పుష్ప 2 ఇచ్చిన బూస్టప్ తో తిరుగులేని ప్యాన్ ఇండియా స్టార్ గా మారాడు అల్లు అర్జున్. ఈ సినిమా సాధించిన రికార్డులు అతని కెరీర్ లో ఓ మైల్ స్టోన్ లా నిలిచిపోతాయి. అదే టైమ్ లో ఈ మూవీ ద్వారా వచ్చిన చేదు అనుభవాలూ గుర్తుండిపోతాయి. ఎలా చూసినా పుష్ప 2 అల్లు అర్జున్ కెరీర్ లో ఎప్పటికీ స్పెషల్ మూవీగానే నిలిచిపోతుందని చెప్పాలి. అలాంటి సినిమా తర్వాత చేసే ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఈ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకువెళ్లేలా లేదంటే నిలబెట్టేలా ఉండాలి. అందుకే అతను త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టాడు అనే టాక్స్ వినిపిస్తున్నాయి.
త్రివిక్రమ్ తో చేసిన అల వైకుంఠపురములో తోనే అల్లు అర్జున్ కు మొదటగా నేషనల్ వైడ్ గా గుర్తింపు స్టార్ట్ అయింది. దాన్ని ఈ స్థాయికి తెచ్చింది సుకుమార్. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో నాలుగో సినిమాగా ఓ భారీ మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ ను రూపొందించబోతున్నారు నిర్మాత బన్నీ వాసు గతంలోనే చెప్పాడు. కాకపోతే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటి వరకూ త్రివిక్రమ్ ఎక్కడా ఓపెన్ కాలేదు. అన్ స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ తన నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్ తోనే అని బాలయ్యతో చెప్పాడు. బట్ ఈ మధ్యలోకి తమిళ్ దర్శకుడు అట్లీ ఎంటర్ కావడంతోనే అసలు ట్విస్ట్ మొదలైందట.
ప్యాన్ ఇండియా ఇమేజ్ అనేది మాస్ మూవీస్ తోనే సాధ్యం. మైథలాజికల్ మూవీస్ అనేవి లాటరీ లాంటివి. తగిలితే తగులుతుంది లేదంటే లేదు. మాస్ మూవీస్ అలా కాదు. తగలకపోయినా టార్గెట్ రీచ్ అవుతారు. అందుకే ముందుగా అట్లీతో ఓ మాస్ మూవీ చేస్తే పుష్ప 2 కంటిన్యూ అయినట్టుగా ఉంటుందని అల్లు అర్జున్ భావిస్తున్నాడు అనే రూమర్ స్టార్ట్ అయింది. నిప్పు లేకుండా పొగరాదు కదా. అందుకే చాలా మంది ఇది నిజమా.. అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కంటే ముందు అట్లీతోనే చేస్తాడు అంటున్నారు. మరి అది నిజమే అయితే ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో ఉంటుందా లేక మొత్తానికే ఆగిపోతుందా అనేది చూడాలి. అంతకంటే ముందు అసలు ఈ వార్తలో నిజమెంత అనేది ఐకన్ స్టార్ టీమ్ నుంచి ఎవరో ఒకరు రియాక్ట్ అయితే స్టార్టింగ్ స్టేజ్ లోనే ఈ రూమర్ ఆగిపోతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com