Bigg Boss Swetha Varma: అప్పుడు దేవీ నాగవల్లి.. ఇప్పుడు శ్వేతా.. బిగ్ బాస్ ఎలిమినేషన్ ఒక స్కామా?

Bigg Boss Swetha Varma: బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ ఉండాలన్నా, వారు ఫైనల్ వరకు వెళ్లి గెలవాలన్నా.. అది ప్రేక్షకుల చేతిలోనే ఉంటుంది. హౌస్‌మేట్స్ నామినేషన్‌లోకి వచ్చినప్పుడు వారికి వచ్చిన ఓట్లును బట్టి తక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారిని ఎలిమినేట్ చేస్తుంది బిగ్ బాస్ టీమ్. అలాగే ఈవారం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిపోయింది శ్వేతా వర్మ. కానీ తన ఎలిమినేషన్‌ను ప్రేక్షకులు అంగీకరించట్లేదు.
బిగ్ బాస్ ఆరవ వారం నామినేషన్‌లో శ్రీరామచంద్ర, సిరి, లోబో, విశ్వ, షణ్ముఖ్, ప్రియాంక, సన్నీ, శ్వేత, యాంకర్ రవి, జెస్సీ ఉన్నారు. వీరిలో శ్వేతా కంటే వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారని, టాస్క్‌లలో పూర్తిస్థాయిలో ఆడకుండా, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయకుండా ఉండే వాళ్లు కూడా ఉన్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వారందరితో పోలిస్తే శ్వేతా వర్మ చాలా బెటర్ అని అంటున్నారు తన ఫ్యాన్స్.
ఒకవేళ ప్రేక్షకుల ఓట్ల వల్లే ఎలిమినేషన్ జరిగితే.. శ్వేతాకు అంత తక్కువ ఓట్లు వచ్చే అవకాశం లేదని కొందరి వాదన. తనకు టాప్ 5లో ఉండే కెపాసిటీ కూడా ఉందని అంటున్నారు మరికొందరు. ఒక్కొక్కసారి ప్రేక్షకులు చాలా ఇష్టపడే కంటెస్టెంట్స్‌నే ఎలిమినేట్ చేస్తారని, ఓట్లతో సంబంధం లేదని సోషల్ మీడియాలో బిగ్ బాస్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
బిగ్ బాస్ సీజన్ 4లో దేవీ నాగవల్లి కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉండేదని.. అప్పుడు తనను కూడా ఇలాగే ఎలిమినేట్ చేశారని ప్రేక్షకులు గుర్తుచేస్తున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ను ఎలిమినేట్ చేస్తూ బిగ్ బాస్ ప్రేక్షకులను మోసం చేస్తున్నారంటూ శ్వేతా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక శ్వేతా ఎలిమినేట్ అయిన తర్వాత సీక్రెట్ రూమ్‌కు వెళ్తుందేమో అనుకున్న వారికి కూడా నిరాశే మిగిలింది. ఇప్పటికే సీక్రెట్ రూమ్‌ను లోబో ఆక్రమించేసాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com