Avatar 2: లీకైనా తగ్గేదే లే.. అవతార్ 2కి షాకింగ్ ఓపెనింగ్స్

Avatar 2: లీకైనా తగ్గేదే లే.. అవతార్ 2కి షాకింగ్ ఓపెనింగ్స్
X
Avatar 2: వరల్డ్‌వైడ్‌గా అవతార్-2 గ్రాండ్ రిలీజ్ అయింది..మూవీ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ విజువల్‌ వండర్‌.. ప్రపంచ వ్యాప్తంగా 52వేల థియేటర్లలో 160 భాషల్లో అవతార్- 2 రిలీజ్‌ అయింది..

Avatar2: వరల్డ్‌వైడ్‌గా అవతార్-2 గ్రాండ్ రిలీజ్ అయింది..మూవీ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ విజువల్‌ వండర్‌.. ప్రపంచ వ్యాప్తంగా 52వేల థియేటర్లలో 160 భాషల్లో అవతార్- 2 రిలీజ్‌ అయింది.. ఇప్పటికే రికార్డు స్థాయిలో అవరాత్‌-2 ప్రీ బుకింగ్స్‌ను స్వంతం చేసుకున్న ఈ మూవీ విడుదలకుముందే రికార్డులు సృష్టించింది. ఇంత గ్రాండ్‌ మూవీకి కూడా పైరసీ బెడద తప్ప లేదు..


ఇక థియేటర్లలో 'అవతార్ 2' విడుదలకు ముందే సినిమా ప్రింట్ ఆన్ లైన్‌లో లీక్ అయ్యింది. పైరసీ ప్రింట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. . ఫ్రీగా సినిమా అందుబాటులో ఉండటంతో కొందరు డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ఐతే ఈ తరహా సినిమాలు థియేటర్లలో చూస్తేనే మజా అనుకున్నారు సినీ ప్రియులు. అందుకే లీకైనా తగ్గేదే లే అన్నట్లున్నాయి ఓపెనింగ్ బుకింగ్స్.


ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైన ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ సినీ లవర్స్ కోసం ఓ థియేటర్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. లార్జ్‌ స్క్రీన్‌ స్క్రీనింగ్‌లో స్పెషల్‌ 3డీ గ్లాసెస్‌ సౌకర్యంతో అవతార్‌ 2 చూసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రసాద్‌ ఐమాక్స్‌ ప్రకటించింది.



ఇవి ప్రత్యేకంగా రూపొందించబడిన డాల్బీ విజన్ 3డి గ్లాసెస్‌. సరికొత్త అనుభూతితో సినిమా చూసిన భావనను డాల్బీ విజన్ 3డి గ్లాసెస్‌ అందిస్తాయి. అలాగే.. ఉదయం నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటున్న అవతార్ 2 చిత్రానికి చెన్నైలో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది.


ఇక గతంలో హాలీవుడ్‌ నుంచి మూవీ అనౌన్స్‌మెంట్‌ వస్తే ఆసక్తిగా ఎదురుచూసే మూవీ లవర్స్‌ టేస్ట్‌ మారిపోయింది.. ఎంత స్టోరిలో దమ్ము ఉన్నా వాటికి తగ్గ హంగులు లేకపోతే లైట్‌ తీసుకుంటున్నారు.. దీన్నే క్యాప్చర్‌ చేసిన డైరక్టర్స్‌ చిన్న లైన్‌ స్టోరి పట్టుకొని అల్లుకు పోతున్నారు.. మూవీకి అసలు కంటే కొసరు అన్న చందాన విజువల్‌ వండర్స్‌ యాడ్‌ చేస్తున్నారు.. అయితే ఈ మూవీస్‌ బడ్జెట్‌ భారీగా ఉండటంతో స్వీక్వెల్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నారు.. అదే వే లో వచ్చిన పాన్‌ వరల్డ్‌ మూవీస్‌ ఏంటో.. వాటి మధ్య ఉన్న సంబంధం ఏంటో చూద్దాం..


అవతార్‌, కేజీఎఫ్‌, బాహుబలి మోస్ట్ పాపులర్ మూవీస్ జాబితా లో చోటు సంపాదించాయి.. ఈ మూడు సినిమాలు విజువల్‌ వండర్స్‌గానే తెరకెక్కాయి.. అలాగే మూడు కూడా సీక్వెల్‌ మావీస్‌గా వరల్డ్ మూవీ లవర్స్‌ ముందుకు వచ్చాయి.. ఫస్ట్ పార్ట్‌లో లవ్‌, ఎమోషన్‌ నేపధ్యంలో సాగిన ఈ మూవీస్‌ సరికొత్త జానర్‌ను క్రియేట్‌ చేశాయి.. బాక్సాఫీస్‌ రికార్డ్‌లను బద్ధలు కొట్టాయి...



అంతేనా థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని క్షణం కూడా కళ్లు తిప్పుకోనివ్వకుండా కట్టిపడేశాయి.. ఇదే జోష్‌లో టైం తీసుకొని మరీ ఈ సినిమాలకు స్వీక్వెల్‌ ప్లాన్‌ చేశారు.. పార్ట్‌-1లో లవ్‌ ట్రాక్‌గా నడిచిన స్టోరి.. పార్ట్‌ -2కి వచ్చేసరికి ఫ్యామిలీ బాండింగ్‌తో కట్టిపడేశారు డైరక్టర్స్‌. ఇలా తెలివిగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నారు. సినిమా నాలుగు కాలాల పాటు బతకాలంటే ఇలాంటివి ఎన్నో చేయాలి మరి.

Tags

Next Story