Avatar 3 : అవతార్ 3 తేడా కొట్టేలా ఉందే

Avatar 3 :  అవతార్ 3 తేడా కొట్టేలా ఉందే
X

అవతార్ 3 .. జేమ్స్ కేమరూన్ డైరెక్ట్ చేసిన మూవీ. ఫస్ట్ పార్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. రెండో భాగం కోసం ఏకంగా 11యేళ్లు టైమ్ తీసుకున్నాడు. 2022లో విడుదలైన ఈ మూవీ కూడా విజయం సాధించింది. అయితే ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేసినప్పుడు సెకండ్ పార్ట్ మాత్రం ఇంకాస్తా బావుండేది అనిపించారు. బట్ ఇప్పుడు థర్డ్ పార్ట్ విషయంలో కూడా అదే రిపీట్ అయ్యేలా ఉందనిపిస్తోంది. ఇంకా చెబితే థర్డ్ పార్ట్ ఏమంత ఆకట్టుకోదు అని ముందే అనిపిస్తుంది.

ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఒక విజువల్ వండర్ ను చూసిన భావన కలుగుతుంది. రెండో భాగం కూడా ఇంచుమించు అలానే అనిపిస్తుంది. బట్ పాత్రల తీరు మాత్రం మారలేదు అనిపించింది. పాత్రలు కూడా మారితే కనుక విజయం మరోలా ఉండేది. ఇక థర్డ్ పార్ట్ విషయంలో కూడా అదే కనిపిస్తోంది. మొదటి, రెండు భాగాల్లోలాగా మూడో భాగంలో కూడా వీళ్లు బాధితులు లాగానే కనిపించడం మాత్రం ఇబ్బంది కరంగా ఉంది. అంటే వీళ్ల పోరాటం మాత్రం ఆగిపోయేలా లేదు. నిరంతరం బాధితుల్లోలాగే కనిపిస్తున్నారు అనిపించారు. రెండో భాగంలో వాటర్ లో పోరాటం చేశారు. మూడో భాగంలో మాత్రం అగ్ని, బూడిదలో మాత్రం పోరాటం చేయబోతున్నారు అనిపించేలా ఉంది. అదీకాక మూడు పాత్రల్లోనూ అదే నటులు కనిపించడం కూడా కొంత మైనస్ గా మారింది.ఆ కారణంగానే ఈ మూడో భాగంపై ప్రేక్షకుల్లో పెద్దగా క్రేజ్ కనిపించడం లేదు. హిట్ మూవీకి సీక్వెల్ లాగా మాత్రం అనిపించడం లేదు. మొత్తంగా ఈ మూవీ హిట్ అయితేనే నాలుగో భాగం తీస్తా అని జేమ్స్ కేమరూన్ చెప్పడాన్ని బట్టి చూస్తే ఇది ఇంతటితో ఆగిపోతుంది అనిపించింది.

Tags

Next Story