Avasarala Srinivas : అవతార్‌కు అవసరాల వాయిస్.. ఇంగ్లీష్ సినిమాకు తెలుగు హీరో..

Avasarala Srinivas : అవతార్‌కు అవసరాల వాయిస్.. ఇంగ్లీష్ సినిమాకు తెలుగు హీరో..
X
Avasarala Srinivas : అవతార్.. ఈ మేనియా ఇప్పుడు మామూలుగా లేదు. ప్రపంచ మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది.

Avasarala Srinivas : అవతార్.. ఈ మేనియా ఇప్పుడు మామూలుగా లేదు. ప్రపంచ మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది. నగరాల్లో అయితే ఇప్పటికే వీకెండ్ వరకూ టికెట్స్ బుక్ అయిపోయాయి. 2009లో వచ్చిన అవతార్ కు కొనసాగింపుగా వస్తోన్న ఈ అవతార్ ద వే ఆఫ్‌ వాటర్ పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.




అయితే ఇన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో విడుదలవుతున్నప్పుడు డబ్బింగ్ రైటర్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి కదా..? ఇప్పటి వరకూ డబ్బింగ్ సినిమాలు అనగానే స్పెషల్ గా వాటికే రాసే టీమ్ ఉండేది. అయితే ఈ సారి అవతార్ కోసం మన తెలుగు దర్శక, నటుడు రంగంలోకి దిగాడు. ఈ చిత్రానికి అతనే తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాశాడు. మరి అతనెవరో చూద్దాం..



అమెరికాలో చదువుకుని టాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టిన నటుడు అవసరాల శ్రీనివాస్. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన అష్టాచెమ్మా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అవసరాల... తర్వాత తనదైన శైలిలో ఆకట్టుకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్ కూడా తెచ్చుకున్నాడు.




కామెడీ పాత్రల్లో ఎక్కువగా కనిపించినా.. ఎలాంటి పాత్రైనా చేయగల ప్రతిభావంతుడు. ఆ ప్రతిభతోనే ఏకంగా దర్శకుడిగా మారి ఫస్ట్ మూవీ ఊహలు గుసగుసలాడేతో విమర్శకులను కూడా మెప్పించాడు. ఈ మూవీతోనే హీరోయిన్ గా రాశిఖన్నా పరిచయం అయింది.



నాగశౌర్యకూ ఇదే ఫస్ట్ హిట్ కావడం విశేషం. కొన్నాళ్లుగా సినిమాలు తగ్గించుకున్నాడు శ్రీనివాస్. కారణాలు ఖచ్చితంగా తెలియలేదు కానీ.. దర్శకత్వం కూడా చేయడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు అవతార్ సినిమాకు తెలుగు డైలాగులు రాసే అవకాశం రావడం విశేషమే.



శ్రీనివాస్ అమెరికాలో ఉన్నాడు కాబట్టి.. ఆ యాక్సెంట్ బాగా తెలుసు. అందుకు తగ్గట్టుగా తెలుగులోనూ డైలాగ్స్ రాశాడని ట్రైలర్స్ చూస్తేనే తెలుస్తోంది. మరి ఈ మూవీలో అతని మాటలకు మంచి స్పందన వస్తే ఈ రంగంలో కూడా దూసుకుపోతాడేమో..

ఇక ఈ నెల 16న విడుదల కాబోతోన్న అవతార్ మేనియా దేశమంతా కనిపిస్తోంది. వయసుతో పనిలేకుండా జేమ్స్ కేమరూన్ క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ ను మొదటి రోజే చూడాలనుకున్నవారి సంఖ్య విపరీతంగా ఉంది. ఈ డిమాండ్ వల్ల మొదటి రోజు టికెట్స్ అయిపోయాయనే చెప్పాలి.



అయితే ఈ క్రేజ్ ఎక్కువగా టౌన్స్ తో పాటు సిటీస్ లో ఉంది. అర్బన్ ఏరియాల్లో అంత డిమాండ్ ఉందని చెప్పలేం. అత్యంత భారీ బడ్జెట్ తో దాదాపు ఐదేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ హిట్ అయితే ముందు చెప్పినట్టుగా మరో పార్ట్ తీస్తా అని చెబుతున్నాడు జేమ్స్. మరి విజయం సాధిస్తుందా లేదా అనేది మరి కొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఏదేమైనా ఓ కొత్త టాస్క్ తోవస్తోన్న అవసరాల శ్రీనివాస్ కు ఆల్ ద బెస్ట్ చెబుదాం..

Tags

Next Story