Avatar: Fire and Ash : అవతార్ 3 ట్రైలర్ కు వేళయింది

Avatar: Fire and Ash :  అవతార్ 3 ట్రైలర్ కు వేళయింది
X

జేమ్స్ కేమరూన్ సృష్టించిన అద్భుత ప్రపంచం అవతార్. 2009లో విడుదలైన అవతార్ చూసిన ప్రతి ఒక్కరూ మరో లోకానికి వెళ్లిపోయారు. విజువల్ ఎఫెక్ట్స్ ను అంత అద్భుతంగా క్యాప్చర్ చేయడం జేమ్స్ ప్రతిభకు నిదర్శనం. ఓ మాస్ కథను గొప్ప బ్యాక్ డ్రాప్ తో ప్రపంచానికి చెందిన పూర్వీకుల నేపథ్యంలో చాలా గొప్పగా చెప్పాడు. అయితే అవతార్ కు కొనసాగింపుగా మరికొన్ని భాగాలు వస్తాయని చెప్పాడు. చెప్పినట్టుగానే రెండో భాగాన్ని కూడా విడుదల చేశాడు. 2022లో అవతార్ : ద వే ఆఫ్ వాటర్ అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఫస్ట్ పార్ట్ కు సెకండ్ పార్ట్ కు చాలా గ్యాప్ తీసుకున్న జేమ్స్ థర్డ్ పార్ట్ విషయంలో ఆ మిస్టేక్ చేయలేదు. ఈ యేడాది డిసెంబర్ 19న అవతార్ : ఫైర్ అండ్ యాష్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. అయితే ఈ మూవీ ట్రైలర్ ను ఈ 25 నుంచి రిలీజ్ చేస్తున్నాడు జేమ్స్ కేమరూన్.

ట్రైలర్ ను రెగ్యులర్ గా కాకుండా ఈ వీకెండ్ లో విడుదల కాబోతోన్న 'ఫెంటాస్టిక్ ఫోర్ :ఫస్ట్ స్టెప్స్' అనే చిత్రంతో పాటు థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నాడు. అంటే తెలుగుతో పాటు ఇతర రీజినల్ లాంగ్వేజెస్ లో రావడానికి ఇంకాస్త టైమ్ పడుతుందన్నమాట. అఫ్ కోర్స్ త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా విడుదల చేస్తాడు. సో.. ఈ థర్డ్ పార్ట్ ట్రైలర్ ను బట్టి సినిమా పై అంచనాలు స్టార్ట్ అవుతాయి.

Tags

Next Story