Avatar : Fire and Ash : మీ అమ్మోరి శక్తులేవీ మాకాడ పనిచేయవ్

అవతార్.. జేమ్స్ కేమెరూన్ సృష్టించిన ఓ అద్భుత ప్రపంచం. 2009లో విడుదలైన ఈ సెన్సేషనల్ మూవీకి ప్రపంచం బ్రహ్మరథం పట్టింది. ఓ గొప్ప కథతో ప్రపంచం మొత్తాన్ని కదిలించాడు జేమ్స్. ఆ తర్వాత వచ్చిన సెకండ్ పార్ట్ సైతం ఆకట్టుకుంది. ఇప్పుడు కొనసాగింపుగా మూడో భాగాన్ని తీసుకువస్తున్నాడు.ఈ డిసెంబర్ 19న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. రీసెంట్ గా ఫెంటాస్టిక్ ఫోర్ మూవీతో పాటు జత చేసిన ట్రైలర్ తర్వాత కాస్త గ్యాప్ తర్వాత యూ ట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇంగ్లీష్ తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయడం విశేషం.
'అవతార్ : ఫైర్ అండ్ యాస్' అనే టైటిల్ తో రూపొందిన ఈ ట్రైలర్ సైతం మెస్మరైజింగ్ గానే ఉంది. మొదట నేల, ఆ తర్వాత నీరు.. ఇప్పుడు నిప్పుడు అనే కాన్సెప్ట్ తో వస్తున్నాడు జేమ్స్ కేమెరూన్. ఫస్ట్ పార్ట్ లోని పాత్రలను కొనసాగిస్తూనే వారి వారసులనూ రంగంలోకి దించాడు. వీరితో పాటు మరో కొత్త తెగ కూడా కనిపిస్తోంది. ఎప్పట్లానే నాగరిక ప్రపంచం వీరి మూలాలను దెబ్బ కొట్టే ప్రయత్నం చేయడం.. దాన్ని వాళ్లు తిప్పి కొట్టడం అనే పాయింట్ కనిపిస్తోంది. అయితే నాగరికులకు లోకల్ గా ఉండే తెగ సాయం చేయడం కనిపిస్తోంది. వాళ్ల సాయంతోనే పండోరా వాసులను అంతం చేయాలనే ప్రయత్నం చేస్తారేమో అనిపిస్తోంది. ఆ క్రమంలోనే ఆ తెగ నాయకురాలు.. పండోరా వాసుల వద్దకు వచ్చి 'మీ అమ్మోరి శక్తులేవీ మాకాడ పనిచేయవు' అని చెప్పే డైలాగ్ బలే ఉంది.
విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే కాదు.. ఎమోషనల్ టచ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నాడు జేమ్స్ కేమెరూన్. అసలు అవతార్ కు అంత పెద్ద హిట్ చేసింది కూడా ఈ ఎమోషన్సే అనేది వాస్తవం. సెకండ్ పార్ట్ లో అవి కాస్త తగ్గినట్టు అనిపించినా.. ఈ సారి కరెక్ట్ మీటర్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఏదేమైనా జేమ్స్ కేమెరూన్ కు మాత్రమే సాధ్యమవుతాయి ఇలాంటి విజువల్ వండర్స్. అతని కష్టం వృథా పోదు అనే ప్రామిసింగ్ లా ఉందీ ట్రైలర్. మరి సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో కానీ.. ట్రైలర్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com