Avatar 2 : 'అవతార్2' టీజర్ ట్రైలర్ వచ్చేసింది

Avatar 2 : ప్రపంచ సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జేమ్స్ కామెరూన్ 'అవతార్ 2' చిత్ర టీజర్ ట్రైలర్ వచ్చేసింది. ఇటీవల విడుదలైన 'డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్' సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్‌లో ఈ టీజర్ ట్రైలర్‌ను విడుదల చేయగా ఇప్పుడు ట్విట్టర్ వేదికగా కామెరూన్ పంచుకున్నాడు. 'అవతార్'తో ప్రేక్షకుల్ని పాండోరా గ్రహంలో విహరింపజేసిన కామెరూన్ ఇప్పుడీ సీక్వెల్ తో సముద్ర గర్భంలోని మరో కొత్త లోకాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు. ఈ ఏడాది డిసెంబరు 16న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, స్టీఫెన్ లాంగ్, మిచెల్ రోడ్రిగ్జ్ మరియు సిగౌర్నీ వీవర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్ర ట్రైలర్ పైన ఓ లుక్కేయుండి..!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com