జూన్ 23 న "మా ఆవారా జిందగీ" రిలీజ్

జూన్ 23 న మా ఆవారా జిందగీ రిలీజ్
100% ఫన్ 0% లాజిక్ మూవీ "మా ఆవారా జిందగీ

ఆవారా లైఫ్ స్టైల్ కు అలవాటు పడి, చదువును అటకెక్కించి నలుగురు యువకులు.. ఉద్యోగంలేక ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే కథతో "మా ఆవారా జిందగీ" ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనెల 23 న రిలీజ్ కానుంది. బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షయాజీ షిండే నటీ నటులుగా దేపా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో చిత్రం రూపుదిద్దుకుంది. విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత నంద్యాల మధుసూదన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.

100% ఫన్ 0% లాజిక్ మూవీ "మా ఆవారా జిందగీ. ఈ చిత్రానికి కంభంపాటి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరించగా.. ప్రతీక్ నాగ్ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 23 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.

చిత్ర దర్శకుడు దేపా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ నగరంలో నలుగురి ఆవారా కుర్రాళ్ల పనులు ఎలా ఉండబోతున్నాయి? ఆ పనులకు కామెడీ ఎలా లింక్ చేశారు? అనే ఫన్ ఓరియెంటెడ్, యూత్ ఫుల్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రమే "మా ఆవారా జిందగి".

Tags

Read MoreRead Less
Next Story