Baaghi 4 Teaser : భాగీ 4.. ఇదేం టీజర్ బాబోయ్

Baaghi 4 Teaser :  భాగీ 4.. ఇదేం టీజర్ బాబోయ్
X

ఈ మధ్య కొన్ని సినిమాలు కేవలం హింసనే నమ్ముకుంటున్నాయి. ఆ మధ్య బాలీవుడ్ లో వచ్చిన కిల్ సినిమా చూసి చాలామంది భయపడిపోయారు. అప్పటి వరకూ ఇండియాలో వచ్చిన మోస్ట్ వయెలెంట్ మూవీ అదే అనేశాం. బట్ లాస్ట్ ఇయర్ మళయాలం నుంచి వచ్చిన మార్కో మూవీ చూశాక.. రక్తం ఏరులై పారడం అంటే ఏంటో వెండితెరపై చూశాం. మార్కో వచ్చాక ఇదే మోస్ట్ వయొలెంట్ మూవీ అనుకున్నారు. ఈయేడాది నాని హిట్ 3 తో అలాంటి ప్రయత్నమే చేశాడు కానీ అది ఆర్టిఫిషియల్ గా ఉందన్నారు ఆడియన్స్.

అంతకు ముందు యానిమల్ లో కూడా రణ్ బీర్ కపూర్ తో రక్తపాతం సృష్టించాడు సందీప్ రెడ్డి వంగా. ఇక తాజాగా భాగీ 4 వంతు వచ్చింది. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ చూస్తే కేవలం హింసను చూపించడానికే సినిమా తీశారా అనిపించక మానదు. అత్యంత హింసాత్మకంగా ఉంది ఈ టీజరే.

కన్నడలో మాస్ ను మెప్పించిన దర్శకుడు ఏ హర్ష ఈ చిత్రాన్ని రూపొందించాడు. భాగీ సిరీస్ లో భాగంగా సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ 2016లో వచ్చింది. తర్వాత మరో రెండు భాగాలు వదిలారు. తాజాగా 4వ భాగం వస్తోంది. పార్ట్స్ గా వస్తోంది కాబట్టి ఇదేం సిరీస్ కాదు. ఒకదానితో ఒకదానికి సంబంధం ఉండదు. అన్నీ ప్రత్యేక కథలే. కాకపోతే హీరో మారడం లేదు అంతే. కథ, హీరోయిన్, విలన్స్ మారుతూనే ఉన్నారు. కాకపోతే కలిసొచ్చిన టైటిల్ అని ఇలా కంటిన్యూ చేస్తున్నారు. మొదటి రెండు భాగాలూ సూపర్ హిట్ అయితే.. థర్డ్ పార్ట్ యావరేజ్ అనిపించుకుంది.

ఇక ఈ మూవీ టీజర్ చూస్తే థియేటర్స్ రక్తం అంటే పడని వారు వాంతులు చేసుకోవడం ఖాయం అన్నట్టుగా ఉంది. అదేదో చికెన్, మటన్ కొట్టినట్టుగా మనుషులను కత్తులతో నరికేస్తున్నారు. హీరో కంటే విలన్ ఎక్కువగా నరికేస్తుంటే.. నేనేం తక్కువా అని హీరోయిన్ తో సైతం కత్తులు దించారు. ఆమె కూడా రక్తపాతం సృష్టించింది. చూస్తుంటే మార్కోను మించి చూపించాలనే టార్గెట్ పెట్టుకున్నారా అనిపించక మానదు. కేవలం హింసను మాత్రమే నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది. దీనికి సరిపడా కంటెంట్ లేకపోతే మాత్రం తేడా కొడుతుంది. చివర్లో సంజయ్ దత్ ఒక చేతిని నరికేస్తాడు. ఆ చేతికి నిప్పు అంటుకుని ఉంటే దాంతో సిగరెట్ వెలిగించుకుంటాడు. అబ్బో.. చూడలేకపోతాం ఆ సీన్. ఏదేమైనా ఈ తరహా మూవీస్ కూ లవర్స్ ఉంటారు. వారికి నచ్చుతుందేమో కానీ.. ఏ మాత్రం సెన్సిటివ్ అని ఫీలయినా.. వాళ్లు ఈ టీజర్ కూ దూరంగానే ఉంటేనే మంచిది. ఆ రేంజ్ లో ఉంది వయొలెన్స్.

Tags

Next Story