బేబీ బ్లాక్ బస్టర్.. ఆనంద్ కు వరుస అవకాశాలు..

అన్న విజయదేవరకొండ అనతి కాలంలోనే గుర్తింపుతెచ్చుకున్నాడు.. తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన అదృష్టాన్ని కూడా పరీక్షించుకుందామనుకున్నాడు. అన్న బాటలోనే పయనించాడు. ఎవరి టాలెంట్ వారిదే.. ఎవరి అవకాశాలు వారివే.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా,, తన ఖాతాలో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా పడలేదు ఇప్పటి వరకు.. ఇప్పుడు బేబీతో ఆలోటు భర్తీ అయింది.. దీంతో నిర్మాతలు ఆనంద్ కోసం క్యూ కడుతున్నారు.. రెండు కొత్త ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం.
రెండు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు ఆనంద్‌తో వరుసగా రెండు సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చాయని టాక్. ఒకరు తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా కాగా మరొకరు మైత్రీ మూవీ మేకర్స్. జ్ఞానవేల్ రాజా సినిమాకు ఓ నూతన దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడు. మరోవైపు, మైత్రీ మూవీ మేకర్స్ మిడిల్ క్లాస్ మెలోడీస్ దర్శకుడు వినోద్ అనంతోజుని ఎంపిక చేసింది. వినోద్ ఆనంద్‌కు ఇప్పటికే కథను చెప్పాడని, అతడికి నచ్చి ఓకే కూడా చేశాడని తెలుస్తోంది. ఆనంద్ ఈ రెండు ప్రాజెక్టులను ఏక కాలంలో పూర్తి చేయడానికి సన్నద్ధమవుతున్నాడు.
వీటితో పాటు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న గం గం గణేశ విడుదల కోసం ఆనంద్ వెయిట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఉదయ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సూపర్ సక్సెస్‌తో ఆనంద్ జోరు మీదున్నాడు. మరికొన్ని చిత్రాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఏదీ ఏమైనా బేబీతో ఆనంద్ లక్ మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com