Varun Dhawan : బేబీ జాన్.. స్టైలూ, మాసూ బాగా పెరిగింది
బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘బేబీ జాన్’. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ సమర్పిస్తోన్న ఈ సినిమా అతనే డైరెక్ట్ చేసిన ‘తెరి’కి రీమేక్. తెరిలో విజయ్ హీరోగా నటించాడు. సమంత, ఎమీజాక్సన్ ఫీమేల్ లీడ్ చేశారు. పోలీస్ ఆఫీసర్ కథే అయినా.. యాక్షన్ తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్న కథ ఇది. ఇదే సినిమాను తెలుగులో పోలీసోడుగా డబ్ చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరుతో చేస్తోన్న రీమేక్ కూడా ఇదే.
ఇక లేటెస్ట్ గా బేబీ జాన్ టీజర్ విడుదల చేశారు. హిందీలో మాత్రం కలీస్ డైరెక్ట్ చేస్తున్నాడు. టీజర్ చూస్తే తెరి కంటెంట్ ను వీళ్లు పెద్దగా మార్చలేదు. కాకపోతే యాక్షన్ డోస్ పెరిగింది. వరుణ్ ధావన్ డిఫెంట్ లుక్స్ తో బావున్నాడు. మామూలుగా బాలీవుడ్ కొన్నాళ్లుగా ఈ తరహా మాస్ మసాలా మూవీస్ పై బాగా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అక్కడి ప్రేక్షకులు కూడా అదే ఇష్టపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ టీజర్ మాస్ మసాలాతో పాటు స్టైలిష్ మేకింగ్ లాగా కనిపిస్తోంది. ఒరిజినల్ లోని సమంత పాత్రలో కీర్తి సురేష్, ఎమీ రోల్ లో వామికా గబ్బీ నటించారు. జాకీ ష్రాఫ్ విలన్. ఈ మూవీతోనే కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ కూడా జరుగుతోంది. బట్ టీజర్ లో తనకు అస్సలు ప్రాధాన్యమే ఇవ్వలేదు. కనిపించిన షాట్ లో కూడా అది తనే అని గుర్తించడం కష్టం అనేలా ఉంది.
నిజానికి తెరిలో అదిరిపోయే మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. సినిమాగానే కాదు.. ఎప్పుడైనా అక్కడక్కడా కొన్ని సీన్స్ చూసినా రిపీటెడ్ గా చూడాలనిపిస్తూనే ఉంటుంది. మరి ఈ మాస్ స్టోరీ బాలీవుడ్ కు ఎలా అనిపిస్తుందో కానీ.. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతోంది బేబీ జాన్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com