Baby Record : 32గంటల్లో 100 ప్లస్ మిలియన్స్ వ్యూస్

Baby Record : 32గంటల్లో 100 ప్లస్ మిలియన్స్ వ్యూస్
ఓటీటీలో రికార్డ్ సృష్టించిన 'బేబీ'.. గంటల్లోనే మిలియన్ల వ్యూస్

ఇటీవలి కాలంలో కలెక్షన్ల సునామీ కురిపించిన 'బేబీ'.. ఇప్పుడు మరో సెన్సేషన్ సృష్టించింది. జులై 14వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డు బ్రేక్ చేసింది. మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతోంది. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం బేబీ. ఇక ఈ సినిమా థియేటర్లలో జులై 14 వ తేదీన రిలీజ్ అయింది. విడుదల అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ ఈ చిత్రాన్ని 10 కోట్ల రూపాయాలతో తెరెకెక్కించారు.

బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100కోట్ల వసూళ్లు కలెక్ట్ చేసిన 'బేబీ'.. ఆగస్టు 25నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తెలుగు కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీకి ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ ఉన్న వారికి 12 గంటల ముందే అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ.. ఆహా సబ్ స్క్రిప్షన్ వారికి ఆగస్టు25 అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో విడుదల అయిన 32 గంటలలోనే అత్యంత వేగంగా 100+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ పొందినట్లు ఆహా ప్రకటించింది. ఈ సందర్భంగా బేబీ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది ఆహా. 'బేబీ' సినిమా తీన్మార్ మోగింది అంటూ క్యాప్షన్ లో కూడా చేర్చంది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక బేబీ శాటిలైట్స్ విషయానికొస్తే.. అది కూడా భారీ రేటుకే అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీని ప్రముఖ టీవీ ఛానలె ఈటీవీ రూ.4 కోట్లకు విక్రయించినట్టు సమాచారం. అయితే ఈటీవీ.. కొత్త సినిమాలను కొనడంలో కాస్త వెనకంజలోనే ఉంటుంది. కానీ ఈ సారి బేబీని కొని షాకిచ్చింది. ఇక ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా టెలికాస్ట్ చేస్తారని సమాచారం. థియేటర్లలో, ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ఈ సినిమా బుల్లితెరపై ఏ రేంజులో టీఆర్పీ సాధిస్తోందో వేచి చూడాలి.


Tags

Read MoreRead Less
Next Story