Bacchal Malli : ఓటిటిలో సందడి చేస్తోన్న బచ్చల మల్లి
అల్లరి నరేష్, అమృతా అయ్యర్ జంటగా నటించిన బచ్చలమల్లి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. యాక్షన్ డ్రామాగా కనిపించినా.. బలమైన భావోద్వేగాలతో నిండిన కథనం ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సుబ్బు మంగాదేవి డైరెక్ట్ చేసిన ఈ మూవీ లవ్ స్టోరీస్ లో కొత్త యాంగిల్ ను చూపిస్తూ.. మరపురాని ప్రయాణం ద్వారా ప్రేక్షకులను తీసుకెళ్తుంది.
90ల నాటి కథాంశంతో, తన తండ్రితో గాఢంగా అనుబంధం ఉన్న బచ్చల మల్లి (నరేష్), తన తండ్రి తన తల్లి నుండి విడిపోయిన తర్వాత కోపం, ఆక్రోశంతో పోరాడుతాడు. దీని వల్ల అతను తనను తానే ధ్వంసం చేసుకున్నవాడవుతాడు. చెడు అలవాట్లకు బానిస అవుతాడు. చెడు అలవాట్లను విడిచిపెట్టి తన జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి సహాయపడే కావేరి (అమృత అయ్యర్)తో ప్రేమలో పడినప్పుడు అతని జీవితం మలుపు తిరుగుతుంది. అయితే, మల్లి మూర్ఖత్వం, అతని భవిష్యత్తును అనిశ్చితంగా వదిలివేస్తుంది.
బచ్చలమల్లి పాత్రలోని నటనకు అల్లరి నరేష్ ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. ప్రేమ, కోపం మధ్య నలిగిపోయే వ్యక్తిగా అద్భుతమైన నటన చూపించాడు.
బచ్చల మల్లి ఇప్పుడు SUN NXTలో అందుబాటులో ఉంది. మానవ స్ఫూర్తి లోతులను అన్వేషించే ఈ యాక్షన్-డ్రామాను మిస్ అవ్వకండి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com