Prashanth Varma : హను మాన్ ఆశిస్సులు తగ్గాయా ప్రశాంత్

హను మాన్ మూవీతో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా అవతరించాడు ప్రశాంత్ వర్మ. ఎవరూ ఊహించనంత పెద్ద విజయం సాధించిందీ మూవీ. అత్యంత పరిమితమైన బడ్జెట్ లో ది బెస్ట్ క్వాలిటీ మూవీ అందించాడు. అతన్నుంచి ఇంత మంచి అవుట్ పుట్ కూడా ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. తేజ సజ్జా లాంటి చిన్న హీరోతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు. తర్వాత వెంటనే జై హను మాన్ కూడా ఉంటుందని.. ఇదో సిరీస్ గా కంటిన్యూ అవుతుందనేలా సంకేతాలు ఇచ్చాడు. తమిళ్ నుంచి లోకేష్ కనగరాజ్ లాగా ప్రశాంత్ సినీవర్స్ ను క్రియేట్ చేశాడు. జై హను మాన్ గా కన్నడ స్టార్ రిషబ్ శెట్టితో ఫోటో షూట్ చేసి రిలీజ్ చేసి వావ్ అనిపించాడు. అయితే ఇక్కడే అతనికి లక్ అడ్డం తిరగింది. హను మాన్ ఆశిస్సులు తగ్గాయి.
తను కథ అందించిన సినిమా అని చాలా గ్రాండ్ గా బిల్డప్ ఇచ్చి రిలీజ్ అయిన దేవకి నందన వాసుదేవా మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. అంతకు ముందే డివివి దానయ్య కొడుకుతో చేయాల్సిన సినిమా ఆగిపోయింది. దేవకి నందన కంటే ముందు అనౌన్స్ అయిన నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీతో లైమ్ లైట్ లో కనిపించాడు. బట్ ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుంది అని కొన్ని రోజులుగా న్యూస్ వచ్చాయి. ఫైనల్ గా అఫీషియల్ గానే ఆగిపోయినట్టు చెబుతున్నారు. అటు చూస్తే రిషబ్ శెట్టి కూడా ఇతన్ని నమ్మేలా లేడు అంటున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ గా జరుగుతాయి. కానీ ఒకే దర్శకుడికి వెంట వెంటనే ఇలాంటి షాకులు తగలడం మాత్రం చాలా రేర్. అది కూడా ప్యాన్ ఇండియా ఆడియన్స్ ను మెప్పించగలిగిన సత్తా ఉన్న దర్శకుడుగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కు ఇది కెరీర్ కే సవాల్ లాంటిది. మరి అతని నెక్ట్స్ స్టెప్ ఏంటో కానీ.. హను మాన్ విజయం తర్వాత అతని యాటిట్యూడ్ మారిందనీ.. దానివల్లే ఎక్కువ సమస్యలు వచ్చాయనే గుసగుసలు కూడా ఉన్నాయి. అందుకే అంటారు విజయాలకు పొంగిపోకూడదని. ఏదేమైనా ఇతనితో పాటు హను మాన్ నిర్మాత కూడా ఇబ్బందుల్లోనే ఉన్నాడు. చూస్తుంటే వీరికి ఆ ఆంజనేయస్వామి ఆశిస్సులు అస్సలు లేనట్టుగా కనిపిస్తోందంటున్నారు నెటిజన్స్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com