Mahesh Babu : మహేష్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

Mahesh Babu  :  మహేష్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు నిజంగా ఇది బ్యాడ్ న్యూసే. ఎంత రాజమౌళి అయితే మాత్రం అంత టైమ్ తీసుకోవాలా అనుకుంటారు కూడా. టాలీవుడ్ లో మోస్ట్ అవెయిటెడ్ కాంబినేషన్ అంటే ఇదే.. రాజమౌళి - మహేష్ బాబు. ఇన్నేళ్ల తర్వాత సెట్ అయినా ఈ కాంబోలో మూవీ ప్యాన్ ఇండియా దాటి వాల్డ్ వైడ్ గా ఒకేసారి పరిచయం కాబోతోంది. ఇంత లేట్ అయినందుకు ఇది మహేష్ కు ప్లస్ అయ్యేదే. అయితే ఈ ప్లస్ తో పాటు ఓ మైనస్ కూడా ఉంది. అతను మరో మూడేళ్ల వరకూ అభిమానులకు కనిపించడు. యస్.. రాజమౌళితో మూవీ అంటే మూడు నాలుగేళ్లు కేటాయించాల్సిందే అనేది అందరికీ తెలుసు. ఈ మూవీ కోసం కూడా అంతే టైమ్ తీసుకోబోతున్నాడు జక్కన్న.

అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉంటుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలోనే చెప్పాడు. ఆ మేరకు ప్రస్తుతం మహేష్ మేకోవర్ జరుగుతోంది. ఇప్పటి వరకూ రాజమౌళి మూవీస్ లో కూడా కనిపించనంత యాక్షన్ కంటంట్ ఈ మూవీలో ఉంటుందట. అందుకే భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ను కూడా వాడబోతున్నారు. అక్టోబర్ చివర్లో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి చీఫ్ టెక్నీషియన్స్, మెయిన్ ఆర్టిస్టులతో కలిసి ఓ వర్క్ షాప్ నిర్వహించబోతున్నాడు రాజమౌళి. ఆ తర్వాత జనవరిలో సెట్స్ పైకి వెళతారట. ప్రపంచ వ్యాప్తంగా చాలా లొకేషన్స్ లో షూట్ చేయబోతున్నారు. అందుకే చాలా ఎక్కువ టైమే పడుతుందట. దీనికి తోడు విజువల్ ఎఫెక్ట్స షాట్స్ చాలా ఉంటాయని.. అందుకే మూవీ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కు కూడా ఎక్కువ సమయం తీసుకుంటారట. సో.. ఇవన్నీ కలిపి చూస్తే సినిమా రిలీజ్ ఎప్పుడు అనే ప్రశ్నకు ఇన్ డైరెక్ట్ గా ఆన్సర్ దొరుకుతుంది.

ప్రస్తుతం వినిపించేదాన్ని బట్టి రాజమౌళి - మహేష్ బాబు మూవీ 2028 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారట. అంటే గుంటూరు కారం రిలీజ్ టైమ్ తో కలిపి చూస్తే దాదాపు నాలుగేళ్ల పాటు మహేష్ నుంచి మరో సినిమా రాదు. మరి ఇది ఫ్యాన్స్ న్యూసే కదా.

Tags

Next Story