Bagheera Trailer : బఘీర ట్రైలర్.. దేవుడు ఎందుకు ఎప్పుడూ రాడు

ప్యాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందించిన కథతో రూపొందిన సినిమా 'బఘీర'. కన్నడలో రోరింగ్ స్టార్ అనే ట్యాగ్ ఉన్న శ్రీ మురళి హీరోగా నటించిన ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్. డాక్టర్ సూరి దర్శకుడు. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ లోరూపొందిన ఈ మూవీని కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ఈ నెల 31న రిలీజ్ కాబోతోన్న బఘీర తెలుగు ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.
దేవుడు ఎందుకమ్మా రామాయణం, భారతం అంటూ ఎప్పుడో వస్తాడు.. ఎందుకు ఎప్పుడూ రాడు.. అని ఓ పిల్లాడు తన తల్లిని అడుగుతున్న డైలాగ్ తో ప్రారంభమైన ట్రైలర్ లో.. మనిషి మృగంగా మారినప్పుడు వస్తాడు అంటూ అందుకు దారి తీసే పరిస్థితిలను ఆమె వివరిస్తుంటే.. అందుకు తగ్గ క్రూరమైన విలన్స్ తో కూడిన సన్నివేశాలతో సాగుతుంది ట్రైలర్. పోలీస్ ఆఫీసర్ అయిన హీరో.. తన యూనిఫామ్ ను పక్కన పెట్టి.. ఆ ప్రాంతంలోని క్రిమినల్స్ అందరినీ ఓ ముసుగు వేసుకుని చంపుతుంటాడు. అత్యంత పాశవికంగా అతను చేసే హత్యలు చూసి డిపార్ట్ మెంట్ హైయర్అథారిటీస్ మిగతా టీమ్ ను తిట్టి.. అతన్ని పట్టుకోమని చెప్పినా.. అతను చంపేది క్రిమినల్స్ నే కాబట్టి చంపడం ఎందుకు అంటూ వాళ్లే అనుకోవడం కనిపిస్తుంది. అయితే ఇందులో శ్రీ మురళి డ్యూయొల్ రోల్ చేశాడా.. లేక పోలీస్, ముసుగు వీరుడు ఒకరేనా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఒక్కరే అయితే ముసుగు ఎందుకు వేయాల్సి వచ్చిందో సినిమాలో చూడాలి. కంప్లీట్ గా ఊరమాస్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది.
పెద్దగా కొత్తదనం అయితే లేదీ ట్రైలర్ లో. ఒక నగరం.. అందులో విలన్స్ జనాల్ని పీడిస్తుండటం.. వారిని కాపాడేందుకు హీరో రావడం.. అది పోలీస్ గానా లేక గ్యాంగ్ స్టర్ గానా లేక ఇలా ముసుగు వీరుడుగానా అనేది ఇప్పటికే అనేక సినిమాల్లో చూసి ఉన్నాం. కాకపోతే కథ, నేపథ్యం, టేకింగ్, మేకింగ్ పరంగా ఏదైనా కొత్తదనం ఉంటే ఆకట్టుకుంటుంది. హీరో ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ శ్రీ మురళి హీరోగానే చేశాడు. అందుకే ఈ కథ అందించాడు. అయితే ఈ హీరో తెలుగు ఆడియన్స్ కు అస్సలు తెలియదు. అందుకే ప్రశాంత్ నీల్ మీదుగానే సినిమా వస్తుంది. అక్టోబర్ 31న తెలుగులో ఇంకా ఐదారు సినిమాలున్నాయి. వాటితో పోటీ పడి ఈ బఘీరా బాక్సాఫీస్ ను గెలుస్తాడా లేదా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com