సల్మాన్ ఖాన్ సినిమాలో నటించాను.. సాయం కోసం అర్థిస్తున్నాను: సునీత శిరోల్

సల్మాన్ ఖాన్ సినిమాలో నటించాను.. సాయం కోసం అర్థిస్తున్నాను: సునీత శిరోల్
భజరంగీ భాయిజాన్‌ చిత్రంలో నటించారు. పలు బుల్లితెర సీరయళ్లలోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

మహమ్మారి మహామహుల్ని కూడా ఆర్థిక ఇబ్బందులకు గురి చేసింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన నటులు బహిరంగంగా వచ్చి ఆర్థిక సహాయం కోసం అడగడం మనం విన్నాము. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి సునీత శిరోల్ ఆరోగ్యం సరిగా లేదని ఆస్పత్రిలో చూపించుకోడానికి డబ్బుల్లేవని అర్థిస్తోంది. తాను ఇప్పటి వరకు దాచుకున్న డబ్బులు చికిత్స కోసం ఖర్చు చేశానని చెబుతున్నారు. భజరంగీ భాయిజాన్‌ చిత్రంలో నటించారు. పలు బుల్లితెర సీరయళ్లలోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

సునీత శిరోల్ కిడ్నీ ఇన్ఫెక్షన్ మరియు ఇతర వ్యాధులతో బాధపడుతోంది. ఒకదాని తరువాత ఒకటి చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలతో ఆమె మంచానికే పరిమితమైంది. తన ఈ స్థితి గురించి మాట్లాడుతూ, "మహమ్మారి వచ్చే వరకు నేను పని చేస్తున్నాను. కానీ లాక్డౌన్ కాలంలో జీవించడానికి నేను పొదుపు చేసిన మొత్తాన్ని ఖర్చు చేశాను.

దురదృష్టవశాత్తు, ఆ సమయంలో నేను కిడ్నీ ఇన్ఫెక్షన్ మరియు తీవ్రమైన మోకాలి నొప్పితో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అదే సమయంలో ఆసుపత్రిలో రెండుసార్లు పడిపోయాను. దాంతో నా ఎడమ కాలు విరిగింది. నేను ఇకపై వంగలేను. నేను గతంలో యాంజియోప్లాస్టీ చేయించుకున్నాను. అనేక ఇతత వ్యాధులతో కూడా పోరాడుతున్నాను. "

ప్రస్తుతం ఒక ఫ్లాట్‌లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నాను అని ఆమె వెల్లడించారు. అయితే ఈ మధ్య అద్దె చెల్లించలేని కారణంగా బయటకు వెళ్లవలసి వచ్చింది. ఇండస్ట్రీ వారిని సహాయం కోరగానూపుర్ అలంకార్‌ను పంపినందుకు సునీత వారికి కృతజ్ఞతలు తెలిపింది. నటి అయిన నూపుర్.. సునీతను తన ఇంట్లోనే ఉండనిచ్చి, ఆమె కోసం ఒక నర్సును నియమించింది.

"నాకు డబ్బు అవసరం కాబట్టి నేను మళ్లీ నటించాలనుకుంటున్నాను. కానీ నా కాలు అందుకు సహకరించట్లేదు. నా పరిస్థితి క్షీణిస్తోంది. నేను మళ్లీ నడవగలనో లేదో నాకు తెలియదు. నాకు ఆర్థిక సహాయం కావాలి. బ్రతకడం చాలా కష్టంగా ఉంది. డబ్బు ఆదా చేయనందున ముంబైలో సొంత ఇల్లు కూడా లేదని ఆమె చింతిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story