Balagam: 'బలగం' సంచలనం.. ఉత్తమ దర్శకుడిగా వేణు
Balagam: ఎవరి నోట విన్నా బలగం సినిమా పేరు వినిపిస్తోంది. చిన్న చిత్రం పెద్ద సంచలనం సృష్టించింది. మనుషుల్లో విలువలు ఇంకా మిగిలే ఉన్నాయని ఈ చిత్రం మరోసారి రుజువు చేసింది. కమెడియన్‌గా ఇండస్ట్రీకి వచ్చి మెగా ఫోన్ చేత పట్టి ఓ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వేణు యెల్దండి. తొలి ప్రయత్నంతోనే అతడు దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. మరిన్ని చిత్రాలు డైరెక్ట్ చేసేందుకు మార్గం సుగమం అయింది. తెలంగాణ సంస్కృతి, ప్రజల అనుబంధాల కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా థియేటర్లు లేని మారుమూల గ్రామాలు సైతం స్క్రీన్లు వేసుకుని సినిమా చూస్తున్నారంటే ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో అర్థమవుతోంది. తెలుగు సినిమా ఖ్యాతి మరింత విస్తరించింద బలంగం సినిమాతో. ఓ మంచి చిత్రం తీయాలంటే స్టార్ హీరోలు, భారీ తారాగాణం, పెద్ద బడ్జెట్ అవసరం లేదని నిరూపించింది బలగం చిత్రం. కేవలం రూ.2 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం రూ.25 కోట్లకు పైగా వసూలు చేసిందంటే ఎంతగా ఆదరిస్తున్నారో ప్రేక్షకులు అనే విషయాన్ని కళ్లకు కడుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న బలగం చిత్రం, ఉత్తమ దర్శకుడిగా వేణు అంతర్జాతీయ అవార్డును సాధించాడు. కాగా లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఉక్రెయిన్‌కు చెందిన ఒనికో ఫిల్మ్ అవార్డ్స్ నుంచి బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డును గెలుచుకుంది. డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్‌లో ఏకంగా నాలుగు అవార్డులు అందుకున్న ఈ మూవీకి మరో ఇంటర్నేషనల్ అవార్డు దక్కడం విశేషం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com