Akhanda Movie : హాట్‌స్టార్‌లో బాలయ్య అఖండ సరికొత్త రికార్డు..!

Akhanda Movie : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ.. ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. తమన్ సంగీతం అందిచారు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 02న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్ళను సాధించి అఖండ విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయింది.
థియేటర్స్ లో రికార్డు బద్దలు కొట్టిన అఖండ..ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. జనవరి 21 సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతుంది అఖండ సినిమా. మొత్తం 24 గంటల్లో 10 లక్షలకుపైగా వ్యూస్ సాధించింది. ఈ రికార్డు ఇండియాలో మరే సినిమాకి లేకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.
ఒక తెలుగు సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడంపై ఓటీటీ వర్గాలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలావుండగా బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి జై బాలయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com