Balakrishna : బాలయ్య తాండవం

Balakrishna :   బాలయ్య తాండవం
X

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయని అందరికీ తెలుసు. ఈ కాంబోలో వచ్చిన మూడు సినిమాలూ హ్యాట్రిక్ విజయాలు సాధించి బాక్సాఫీస్ ను ఊపేశాయి. ముఖ్యంగా బాలయ్యను ఎలా చూపిస్తే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయో బోయపాటికి బాగా తెలుసు. అందుకే వీరి కాంబినేషన్ కు అంత క్రేజ్ వచ్చింది. అటు నందమూరి ఫ్యాన్స్ కూడా బోయపాటి సినిమా అంటే స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఇటు బయ్యర్స్ అంతా కూడా లాభాలు గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోతారు. ఆ స్థాయిలో ఉన్న ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తోందంటే ఎంటైర్ ఇండస్ట్రీ ఇటువైపే చూస్తుంది కదా. అలాగే చేస్తోందీ మూవీ ఓపెనింగ్.

'బిబి4' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందబోతోన్న ఈ మూవీ అఖండకు సీక్వెల్ గా వస్తోంది. అఖండ టైటిల్ కు తగ్గట్టుగానే అఖండ విజయం సాధించింది. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే తిరుగేలేదు అనుకోవచ్చు. పైగా అఖండలో సీక్వెల్ కు సరిపడా సరంజామా కూడా వదిలారు. బాలయ్య డ్యూయొల్ రోల్ లో ఒక పాత్ర అఘోరాగా కనిపించడం ఆశ్చర్యపరిచినా.. ఆ పాత్రను ఆయన ఓన్ చేసుకున్న విధానానికి చాలామంది ఫిదా అయ్యారు. తాజాగా ఈ మూవీ ఓపెనింగ్ అట్టహాసంగా జరిగింది.

ఇక ఈ సీక్వెల్ కు ''తాండవం'' అనే టైటిల్ పరిశీలనలో ఉందట. అఫ్ కోర్స్ ఫస్ట్ టైటిల్ ను కూడా కంటిన్యూ చేస్తారు. అంటే 'అఖండ తాండవం' అనుకోవచ్చు. మరి అఘోరాగా బాలయ్య తాండవం ఆడితే బాక్సాఫీస్ బద్ధలైపోదూ..? ఆ మేరకు ఈ మూవీ కంటెంట్ కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఈ మూవీలోని కాస్ట్ అండ్ క్రూ కు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Tags

Next Story