సినిమా

Balakrishna-Raviteja: భారీ మల్టీ స్టారర్ ఆన్ ది వే.. బాలయ్యతో మాస్ మహారాజ్‌..

Balakrishna-Raviteja: బాలకృష్ణ, రవితేజ.. ఈ ఇద్దరు ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉన్నారు.

Balakrishna-Raviteja: భారీ మల్టీ స్టారర్ ఆన్ ది వే.. బాలయ్యతో మాస్ మహారాజ్‌..
X

Balakrishna-Raviteja: చాలాకాలం క్రితం సినీ పరిశ్రమలో మల్టీ స్టారర్లకు ఉండే క్రేజే వేరు. కానీ ఒకతరం తర్వాత హీరోలెవరూ మల్టీ స్టారర్లు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. మళ్లీ ఇప్పుడిప్పుడే మల్టీ స్టారర్లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. స్టార్ హీరోలు సైతం మరొక హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఓకే చెప్తున్నారు. తాజాగా టాలీవుడ్‌లో మరో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సిద్ధం అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

బాలకృష్ణ, రవితేజ.. వీరిద్దరు ఏదైనా సినిమా ఈవెంట్లలో కలవడం తప్పా పెద్దగా ఒకే స్టేజ్‌పై కనిపించింది లేదు. అలాంటిది ఈ ఇద్దరు హీరోలు కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తే.. ఇక మాస్ ఆడియన్స్‌కు ఫుల్ ఫీస్టే అనుకుంటున్నారు అభిమానులు. అయితే త్వరలోనే ఈ ఇద్దరు హీరోలను ఒకే సినిమాలో చూసే టైమ్ రానుందని టాక్ వినిపిస్తోంది.

బాలకృష్ణ, రవితేజ.. ఈ ఇద్దరు ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు రవితేజ కూడా మరో హీరోగా నటించే అవకాశం ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతుందని మ్యుచువల్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES