Balakrishna : బోయపాటిపై బాలయ్య గుస్సా.. ఇందుకేనా..?

Balakrishna :  బోయపాటిపై బాలయ్య గుస్సా.. ఇందుకేనా..?
X

ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనేది మహేష్ బాబు డైలాగ్. ఒక్కసారి కమిట్ అయితే దర్శకుడి మాటే వింటాడు.. ఇది బాలయ్య కోసం వాడే మాట. కథ ఒక్కసారి ఫైనల్ అయిందా.. ఇంక అంతే దర్శకుడు ఏం చెప్పినా చేస్తాడు బాలయ్య. దర్శకుల పనిలో వేలు పెట్టడం.. ఇన్వాల్వ్ కావడం ఉండదు. వారికి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తాడు. అందుకే కొన్ని సినిమాలు మిస్ ఫైర్ అయినా.. రైట్ లైన్ లో ఉంటే బ్లాక్ బస్టర్స్ అయిపోతాయంతే. అలాంటి బాలయ్యకు కోపం వచ్చేలా చేశాడట దర్శకుడు బోయపాటి శ్రీను.

బోయపాటి, బాలయ్య కాంబినేషన్ కు తిరుగులేని క్రేజ్ ఉంది. బోయపాటి సినిమా అంటే బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోతారు. అందుకే ఈ కాంబోలో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఒకదాన్ని మించి ఒకటి విజయం సాధించాయి. రీసెంట్ గా వీరు డబుల్ హ్యాట్రిక్ పై కన్నేశారు. అఖండ కు సీక్వెల్ గా అఖండ 2తో వస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి అనేక మార్పులు చేశాడట దర్శకుడు. అందులో మొదటిది హీరోయిన్ ను మార్చారు అనడం. ప్రగ్యా జైశ్వాల్ ను తప్పించి సంయుక్తను తీసుకున్నారు. అయితే సంయుక్త ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రగ్యా ఉంది. కానీ ఇప్పుడు లేదు. ఈ మార్పు బాలయ్యకు తెలియకుండానే చేశాడట దర్శకుడు.

ఇక విలన్ గా మొదట సంజయ్ దత్ ను తీసుకుంటున్నాం అని చెప్పారు. బట్ ఆయన్ని కూడా తప్పించారు. మీడియం రేంజ్ ఇమేజ్ ఉన్న వేరే వారితో విలన్ పాత్ర చేయిస్తున్నారట. ఆ క్రమంలోనే ఆది పినిశెట్టి ఎంటర్ అయ్యాడు అంటున్నారు. ఈ విషయమూ బాలయ్యకు తెలియకుండానే దర్శకుడు, నిర్మాతలు కలిసి నిర్ణయం తీసుకున్నారట. ఈ రెండు విషయాల్లో తనను కనీసంగా సంప్రదించకపోవడంతో బాలయ్య అందరి ముందే బోయపాటిని కొన్ని మాటలు అన్నాడని టాక్. ఆ కారణంగా ప్రస్తుతం అఖండ 2 సెట్స్ లో దర్శకుడు, హీరో మధ్య ఓ నిశ్శబ్దం కొనసాగుతోందని.. త్వరలోనే ఈ ఇష్యూ సమసిపోతుందని అంటున్నారు. మరి ఇది నిజమా కాదా అనేది అఖండ 2 టీమ్ నుంచే ఓ క్లారిటీ వస్తే బెటర్.

Tags

Next Story