Balakrishna : జైలర్ 2 బాలయ్య .. నిజమెంత..?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మూవీ అంటే ఫ్యాన్స్ కు ఎంత కిక్ వస్తుందో వేరే చెప్పక్కర్లేదు. ప్రస్తుతం అఖండ 2తో రెడీ అవుతున్నాడు బాలయ్య. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఆయన చేస్తోన్న నాలుగో సినిమా ఇది. మొదటి మూడూ సింహా, లెజెండ్, అఖండ.. ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అఖండకే సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ఈ యేడాది సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. ఈ సారి మరింత మాస్ గా ఉండబోతోందని చెబుతున్నారు. ఫస్ట్ పార్ట్ లో ఇంటర్వెల్ కు ముందు అఘోరా పాత్ర ఎంటర్ అవుతుంది. ఈ పార్ట్ లో అఘోరా పాత్రే అంతా కనిపిస్తుందట. దీన్ని బట్టి ఈ సారి బాలయ్య నట విశ్వరూపం సినిమా అంతా కనిపించబోతోందనుకోవచ్చు. ఈ మూవీ తర్వాత మరోసారి గోపీచంద్ మలినేనితో సినిమా చేయబోతున్నాడు. ఈ కాంబోలో ఇంతకు ముందు వీర సింహారెడ్డి అనే సూపర్ హిట్ మూవీ వచ్చింది.
ఇక కొన్ని రోజులుగా బాలకృష్ణ .. తమిళ్ లో రజినీకాంత్ జైలర్ 2లో నటించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. జైలర్ లో ఆల్రెడీ కన్నడ నుంచి శివరాజ్ కుమా, మళయాలం నుంచి మోహన్ లాల్ మోస్ట్ పవర్ ఫుల్ కేమియోలు చేశారు. ఆ కేమియోలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. అలాంటి కేమియోనే జైలర్ 2లో బాలయ్య చేయబోతున్నాడు అనే న్యూస్ విపరీతంగా వినిపిస్తున్నాయి. చాలామంది వీటిని రూమర్స్ అనే అనుకుంటున్నారు. బట్ తాజాగా అది నిజమే తేలింది. బాలయ్య ఆ కేమియో చేయబోతున్నాడట. రజినీతో ఉన్న స్నేహంతోనే ఈ పాత్రకు ఒప్పుకున్నాడు అంటున్నారు. మరి బాలయ్య కేమియో అంటే ఫస్ట్ పార్ట్ కు మించిన ఎలివేషన్స్, పవర్ కనిపిస్తుంది. ఓ రకంగా సినిమాను డామినేట్ చేయగల సత్తా బాలయ్య కేమియోకు ఉంది. మరి ఈ పాత్రను ఎలా డిజైన్ చేస్తారో కానీ.. త్వరలోనే ఈ కేమియోకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వస్తుందంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com