Balakrishna Daughter : ఇండస్ట్రీలోకి బాలయ్య చిన్న కూతురు
నటరత్న నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోందని తెలుస్తోంది. చిన్నకూతురంటే బాలయ్యకు పంచ ప్రాణాలు. ఆమె మాటే బాలయ్య మాట అని టాక్. 'అఖండ’నుండి బాలకృష్ణ నటిస్తున్న సినిమాలు అన్నీ ఈమె ఎంపిక చేసినవేనట. ఆమె ఏం చెప్పినా బాలయ్య కాదనడు అని, చిన్న కూతురు మాటే బాలయ్య మాట అని ఆయన సన్నిహితులు ఎక్కువగా చెబుతుంటారు. ఇదిలా ఉండగా నందమూరి తేజస్విని త్వరలోనే నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతుందట. అది కూడా మోక్షజ్ఞ డెబ్యూ మూవీతో అని సమాచా. నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. సెప్టెంబర్ 6న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. రామకృష్ణ స్టూడియోస్ లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు బాలకృష్ణ. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందట. 'ఎస్.ఎల్.వి సినిమాస్' బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో నందమూరి బాలకృష్ణ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని సమాచారం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com