Balakrishna : బాలయ్య మృతి పట్ల బాలకృష్ణ ఎమోషనల్ పోస్ట్...!

Balakrishna : సీనియర్ నటుడు బాలయ్య మృతి పట్ల హీరో బాలకృష్ణ సంతాపం తెలిపారు.. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
"సీనియర్ నటుడు మన్నవ బాలయ్య గారి మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. బాలయ్య గారు అద్భుతమైన నటులు, నాన్న గారితో కలిసి నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా బాలయ్య తన ప్రతిభను చూపారు. ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం వుంది. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని బాలయ్య పోస్ట్ చేశారు.
కాగా బాలకృష్ణ నటించిన 'పాండురంగడు', 'మిత్రుడు', 'శ్రీరామరాజ్యం' సినిమాలలో బాలయ్య నటించారు. ఇక వయసురీత్యా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలయ్య హైదరాబాద్ లోని యూసఫ్‌గూడలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా.. మరణం కూడా ఈ రోజే సంభవించడం అంతా యాదృశ్చికం.
Actor, MLA #NandamuriBalakrishna expressed his deepest condolences on the sudden demise of Veteran actor Shri #Balayya garu. pic.twitter.com/k8mJnRkAgy
— Vamsi Kaka (@vamsikaka) April 9, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com