Balakrishna : దాని వల్ల దేశం తిరోగమనంలో పయనించే పరిస్థితి ఉంది : బాలకృష్ణ

Balakrishna : భారత ప్రజలు పీల్చుకుంటున్న స్వేఛ్చావాయువులు ఎందరో మహానుభావుల త్యాగఫలితమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బాలకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు . మహాత్మా గాంధీ, నేతాజీ, పింగలి వెంకయ్య, వావిలాల గోపాల కృష్ణ వంటి ఎందరో మహానుభావులు ఈ దేశానికి స్వాతంత్ర్యం సిద్దించడానికి విశేష కృషి చేశారన్నారు.
75 సంవత్సరములలో ఎంతో పురోగతి సాధించినా ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందన్నారు .యువత మత్తు పదార్థములకు బానిస కావడం వల్ల దేశం తిరోగమనంలో పయనించే పరిస్థితి ఉందని హెచ్చరించారు.దీంతో పాటూ నానాటికీ పెచ్చరిల్లుతున్న అవినీతి పై ప్రతి ఒక్కరూ తమ తమ పరిథిలో రాజ్యాంగబద్దంగా, నీతి నిజాయితీలతో పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com