NTR - Balayya : అబ్బాయ్ కోటి .. బాలయ్య కోటి

NTR - Balayya :  అబ్బాయ్ కోటి .. బాలయ్య కోటి
X

నందమూరి హీరోలా మజాకానా అనిపించారు ఒకే రోజు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. అనేక మంది ఇళ్లు కోల్పోయారు. నిరాశ్రయులయ్యారు. వేలమంది ఇంకా నీళ్లలోనే ఉన్నారు. విజయవాడ నగరం అయితే కనీ వినీ ఎరుగనంత నష్టాన్ని చూసింది. ఇటు తెలంగాణలో ఖమ్మం సహా అనేక జిల్లాలు అతలాకుతలం అయ్యారు. రెండు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో జనం చనిపోయారు. ఇలాంటి విపత్తుల వేళ దేశంలోనే ముందుగా స్పందించేది తెలుగు సినిమా పరిశ్రమ అని గర్వంగా చెప్పుకోవచ్చు.

నిరాశ్రయులైన వారికి సాయం అందించేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు విరాళం ప్రకటించాడు. అతన్ని అభిమానించే హీరోలైన సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షలు అనౌన్స్ చేశాడు. అలాగే విశ్వక్ సేన్ 5 లక్షలు ప్రకటించాడు.

ఇక అబ్బాయ్ కోటి ఇచ్చాడు అని కాదు కానీ ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడూ ముందే ఉండే నందమూరి బాలకృష్ణ కూడా తన వంతుగా కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. ఇది కూడా రెండు రాష్ట్రాలకు చెరో 50 లక్షలుగా ఇవ్వబోతున్నాడు. సో.. ఈ హీరోలను చూసి మరింత మంది స్పందిస్తారు అని వేరే చెప్పక్కర్లేదు.

Tags

Next Story