Balakrishna : థమన్ కు బాలయ్య ఖరీదైన గిఫ్ట్

Balakrishna :  థమన్ కు బాలయ్య ఖరీదైన గిఫ్ట్
X

కొన్నాళ్లుగా థమన్ ను ఓన్ చేసుకుంది నందమూరి కుటుంబం. అందుకే అతన్ని ఎస్ థమన్ గా కాక నందమూరి థమన్ అని ఫ్యామిలీ అంతా సరదాగా సంబోదిస్తున్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహారాజ్ వంటి బాలయ్య బ్లాక్ బస్టర్స్ లో థమన్ నేపథ్య సంగీదానికి ప్రధాన పాత్ర అనేది అందరికీ తెలుసు. దీనికి తోడు తెలుగు దేశం పార్టీతోనూ థమన్ సన్నిహితంగానే ఉంటున్నాడు. ఇవాళ(శనివారం) సాయంత్రం మంగళగిరిలో థమన్ ఆధ్వర్యంలోనే కూటమి ప్రభుత్వం మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహిస్తోంది. ఇందుకోసం చాలా రోజులుగా సన్నాహాలు సాగుతున్నాయి. ఈ కాన్సర్ట్ ద్వారా కొన్ని నిధులు సమకూర్చుకోవడం అనేది ప్రభుత్వ అజెండా.

ఇక ఈ నందమూరి థమన్ కు బాలకృష్ణ తాజాగా ఖరీదైన బ్రాండ్ న్యూ పోర్సే కార్ ను గిఫ్ట్ గా అందించడం విశేషం. మామూలుగా ఇలాంటి గిఫ్ట్స్ నిర్మాతలు ఇస్తుంటారు.అది కూడా దర్శకులకు లేదా హీరోలకు అందిస్తుంటారు. ఫరే ఛేంజ్ అన్నట్టుగా హీరోనే తన మ్యూజిక్ డైరెక్టర్ కు హీరో ఇంత కాస్ట్ లీ గిఫ్ట్ ఇవ్వడం మాత్రం ఫస్ట్ టైమ్ అనే చెప్పాలి.ప్రస్తుతం బాలయ్య .. థమన్ కు ఇంత ఖరీదైన కార్ ను గిఫ్ట్ గా ఇవ్వడం టాక్ ఆఫ్ ద టాలీవుడ్ స్టేట్స్ అయింది.

Tags

Next Story