Balakrishna: బాలయ్య కొత్త చిత్రం.. డైరెక్టర్ ఎవరో అస్సలు ఊహించలేరు..

Balakrishna: బాలయ్య కొత్త చిత్రం.. డైరెక్టర్ ఎవరో అస్సలు ఊహించలేరు..
Balakrishna: నందమూరి బాలకృష్ణ దూకుడుకు కుర్ర హీరోలు కూడా కుదేలైపోతున్నారు. ఏడాదికి ఒక చిత్రం చేయడమే మన హీరోలకి కష్టంగా ఉంటే.. బాలయ్య మాత్రం ఇంకా కుర్రాడిలా వరుస మూవీస్ తో దూసుకుపోతున్నాడు.

Balakrishna: నందమూరి బాలకృష్ణ దూకుడుకు కుర్ర హీరోలు కూడా కుదేలైపోతున్నారు. ఏడాదికి ఒక చిత్రం చేయడమే మన హీరోలకి కష్టంగా ఉంటే.. బాలయ్య మాత్రం ఇంకా కుర్రాడిలా వరుస మూవీస్ తో దూసుకుపోతున్నాడు.


ఇప్పటికే వీరసింహారెడ్డితో సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య.. తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీకంటే ముందే ఓ సర్ ప్రైజింగ్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు. ఈ కాంబినేషన్ ఖచ్చితంగా టాలీవుడ్ లో సెన్సేషన్ అవుతుంది. ఇంకా చెబితే దర్శకుడిని కనీసం ఊహించలేరు కూడా. మరి ఈ ప్రాజెక్ట్ ఏంటీ.. డైరెక్టర్ ఎవరు చూద్దాం..

నందమూరి బాలకృష్ణ దూకుడు టాలీవుడ్ షాక్ అవుతోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే ఆహా ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ అంటూ అందరి థింకింగ్ ను మార్చేస్తున్నాడు. సీనియర్స్ అయినా.. కుర్రాళ్లైనా.. తనదైన వాక్చాతుర్యంతో కుమ్మేస్తున్నాడు.

ప్రస్తుతం సెకండ్ సీజన్ జరుగుతోన్న ఈ షో ద్వారానే అతనికి అల్లు అరవింద్ తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో తన ప్రొడక్షన్ లో బాలయ్యతో సినిమా ఉందని అనౌన్స్ చేశారు అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎవరూ ఊహించని విధంగా వెంకటేష్‌ మహా దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.


కేరాఫ్ కంచరపాలెం మూవీతో విమర్శకులను కూడా మెస్మరైజ్ చేసిన వెంకటేష్‌ మహా ఆ తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో ఆకట్టుకున్నాడు. అతను చెప్పిన కథకు బాలయ్య ఓకే అనేశాడట.

బాలయ్య ఇప్పటి వరకూ ఇలాంటి సినిమాల్లో కనిపించలేదు. అదే మూవీకి బిగ్ హైలెట్ అవుతుందట. విశేషం ఏంటంటే.. కేవలం 30 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. వెంకటేష్‌ మహాకు ఈ ఛాన్స్ రావడమే విశేషం. మరి ఈ కాంబినేషన్ ఆడియన్స్ కు ఎలాంటి థ్రిల్స్ ఇస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story