సినిమా

Balakrishna : బాలకృష్ణ వదులుకున్న ఎనిమిది బ్లాక్‌‌‌బస్టర్ సినిమాలు ఇవే..!

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సినిమాలు చేశారు. వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఇందులో బ్లాక్‌‌‌‌బస్టర్ సినిమాలున్నాయి.

Balakrishna :  బాలకృష్ణ  వదులుకున్న ఎనిమిది బ్లాక్‌‌‌బస్టర్ సినిమాలు ఇవే..!
X

Balakrishna : నందమూరి నటసింహం బాలక‌ృష్ణ కెరీర్ లో ఎన్నో సినిమాలు చేశారు. వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఇందులో బ్లాక్‌‌‌‌బస్టర్ సినిమాలున్నాయి. రికార్డు సృష్టించిన సినిమాలున్నాయి. అలాగే బాలకృష్ణ వదులుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. కొన్ని కథ నచ్చాక వదిలేస్తే మరికొన్ని డేట్స్ అడ్జెస్ట్ అవ్వక వదిలేశారు బాలయ్య.. అయితే అలా బాలయ్య మిస్ చేసుకున్న ఎనమిది బ్లాక్ బస్టర్ హిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..!

బజారురౌడీ : ముందుగా ఈ సినిమాని బాలకృష్ణ, దర్శకుడు కోదండరామిరెడ్డి కలిసి చేద్దామని అనుకున్నారు కానీ బాలయ్య డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో కృష్ణ తనయుడు రమేష్ బాబుతో ఈ సినిమాని తెరకెక్కించారు.

చంటి : చిన్నతంబి అనే తమిళ సినిమాకి ఇది రీమేక్.. ముందుగా దీనిని బాలయ్యతో చేయాలనీ అనుకున్నారు కానీ బాలకృష్ణకి కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారు. దీనితో రాజేంద్రప్రసాద్ తో ఫిక్స్ అయ్యారు. చివరికి వెంకటేష్ చేశాడు.

సూర్యవంశం : ఈ సినిమా నిర్మాత ఆర్ బి చౌదరీ ముందుగా బాలయ్యతో ఈ సినిమాని చేయాలనీ అనుకున్నారు. అయితే పెద్దన్నయ్యకి స్టోరీ దగ్గరగా ఉందని రిజెక్ట్ చేశారు బాలయ్య.

సింహరాశి : వి సముద్ర ఈ సినిమాని బాలయ్యతో చేయాలనీ నరసింహుడు నిర్మాత చెంగల వెంకట్ రావుని సంప్రదించారు. సమరసింహారెడ్డి సక్సెస్ తో తర్వాత ఇలాంటి సినిమా కరెక్ట్ కాదని బాలయ్య రిజెక్ట్ చేశారు.

సీతయ్య : బాలకృష్ణని మాత్రమే దృష్టిలో పెట్టుకొని దర్శకుడు వైవిఎస్ చౌదరీ ఈ కథని రాసుకున్నారు. బాలయ్యకి కూడా కథ బాగా నచ్చింది. కానీ చెన్నకేశవరెడ్డి సినిమాతో బిజీగా ఉండడంతో ఈ సినిమాని వదులుకున్నారు. హరికృష్ణ ఈ సినిమాని చేశారు.

సింహాద్రి : విజయేంద్రప్రసాద్, రాజమౌళి ఈ కథను కేవలం బాలకృష్ణని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నారు. కానీ కథ నచ్చకపోవడంతో ఎన్టీఆర్ తో చేశారు.

వకీల్ సాబ్ : ఈ సినిమాని ముందుగా బాలకృష్ణతో చేయాలనీ అనుకున్నామని నిర్మాత దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కానీ ఏమైందో తెలియదు ఆ ప్లేస్ లోకి పవన్ కళ్యాణ్ వచ్చారు.

Next Story

RELATED STORIES